Good News For Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా..!
ఎట్టకేలకు నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. రాష్ట్ర సర్కార్ నిరుద్యోగుల పట్ల గుడ్ న్యూస్ తెలియజేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సీట్ల భర్తీకి ఆమోదం తెలిపింది. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కావలసిన నియమ నిబంధనలను రూపొందిస్తూ జీవోను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పోస్టుల భర్తీకి అయ్యే నిబంధనల మేర సూచనలు జారీ చేసింది. గత ఎన్నో ఏల్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల ఉద్యోగాల నియామకాల పట్ల శ్రద్ధ వహిస్తూ మరో అడుగు ముందుకేసింది.
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సీట్ల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమక్షంలో కమిటీని సిఫార్సు చేస్తూ ప్రభుత్వం వేసి నిబంధనలకు లోబడి నియామక ప్రక్రియను కొనసాగించాలని సూచించింది. ప్రభుత్వం జారీ చేసిన నియామకం నిబంధనలను యూనివర్సిటీల పాలకమండలు సమావేశం ఏర్పాటు చేసి ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పద్ధతిని పాటించడం మాత్రం తప్పనిసరి. అయితే ప్రభుత్వం ప్రకటించిన జివో నంబర్ 21 లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు సంబంధించిన స్పష్టత ఇవ్వకపోవడం నిరుద్యోగులకు నిరుత్సాహానికి గురిచేస్తుంది. యూనివర్సిటీలో మొత్తం పోస్టులకు కలిపి రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను అమలు చేస్తారా? లేక డిపార్ట్మెంట్ల వారీగా రోస్టర్ పాయింట్లను నిర్ణయించి భర్తీ చేస్తారా అనేదానిపై స్పష్టత లేదు. అభ్యర్థుల జాబితాతో పాటు వారి మార్కుల వివరాలు వెబ్సైట్లో పెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులలో సగం మాత్రమే ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లుగా తెలిసింది.
ఈ ప్రక్రియ వైస్ ఛాన్స్లర్ ఆధ్వర్యంలో కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. అభ్యర్థుల యొక్క రికార్డులతో పాటు వారి పరిశోధన పరిజ్ఞానంపై 50% మార్కులు, వారి అనుభవం, బోధన తీరు చూసి మరో 30% మార్కులు, ఇంటర్వ్యూ పూర్తి అయ్యాక వారి వ్యక్తిత్వం సబ్జెక్టుపై అభ్యర్థులు ఇచ్చిన విశ్లేషణ వారి పరిజ్ఞానం, వారి వ్యక్తిత్వాన్ని పరిశీలించి మరో 20% మార్కులు కేటాయిస్తు ఈ విధంగా అభ్యర్థులకు మార్కులను వేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 యూనివర్సిటీలు ఉండగా ఆచార్యులు, సహా ఆచార్యులు, సహాయ ఆచార్యులు కలిపి మొత్తం 2817 పోస్టులు ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1524 ఉండగా, 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కేవలం ఖాళీ ఉన్నఅసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మాత్రమే, అందులో సగం పోస్టులే మొదటి ప్రక్రియలో భర్తీ చేయాలని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తూ విద్యాశాఖకు సూచించినట్లు సమాచారం.