Precautions: ప్రతిరోజు కూడా మనము చాలా వస్తువులను కాకుతూ ఉంటాము. అది సర్వసాధారణం. కానీ కొన్ని వస్తువులలో మాత్రం లక్షలలో వైరస్లు ఉంటాయి. కాబట్టి నిత్యం మనం ఇలాంటి వస్తువులను ముట్టుకున్న తర్వాత చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే పదే పదే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మనం తెలిసి లేక తెలియకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను తాకడం వలన మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాల ద్వారా తాజాగా వెళ్లడైంది. ఈ మధ్యకాలంలో న్యూయార్క్ లో జరిగిన ఒక అధ్యాయంలో కరెన్సీ నోట్లలో వేలాది క్రిములు మరియు వైరస్లు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కరెన్సీలో ఉండే వేలాది క్రిములు ఒకరి నుండి మరొకరికి అనేక రకాల వ్యాధులను వ్యాప్తి చెందడంలో ప్రధాన కారణమని పరిశోధనలో తేలింది.
గతంలో 2017లో ఇన్ఫెక్షన్ డిసీజెస్ లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో కూడా చేతిపరిశుభ్రత వేగు వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని బయటపడింది. కాబట్టి వైద్యులు చెప్తున్న దాన్నిబట్టి మీరు కొన్ని రకాల వస్తువులను తాకిన తర్వాత తప్పకుండా చేతులను కడుక్కోవడం చాలా అవసరం. డబ్బు అంటే అందరికీ ఇష్టమే. నోట్లను లెక్కించడం మరియు దాచుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యోగంలో ఆన్లైన్ చెల్లింపులు పెరిగినప్పటికీ నగదు లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. ఈ కరెన్సీ నోట్లు ఒకరి చేతి నుంచి మరొకరికి మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ నోట్లలో ఉండే సూక్ష్మ క్రిములు కూడా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కరెన్సీ నోట్లనో తాకిన తర్వాత చేతులను కడగడం చాలా అవసరం.
అలాగే చాలామంది హోటల్లు లేదా రెస్టారెంట్లో మెనూ కార్డును చూస్తారు. వీటి ద్వారా కూడా క్రిములు ఒకరి నుంచి మరొకరికి ప్రవేశించవచ్చు. గతంలో హరిజోన విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం రెస్టారెంట్ మెనూ కార్డులో దాదాపు 1,85,000 రకాల బ్యాక్టీరియాలో ఉంటాయని తేలింది. కాబట్టి వీటిని తాకిన తర్వాత కూడా చేతులను శుభ్రంగా కడగాలి. ఆసుపత్రిలో ఉండే వస్తువులు అలాగే బస్సులు మరియు రైళ్లలో ఉండే వస్తువులను తాకిన తర్వాత కూడా చేతులను కడగాలి. అలాగే ఇతర కార్యాలయాలలో ఉపయోగించే పెన్నులు లేదా పెన్సిళ్లను తాకిన తర్వాత కూడా చేతులను కడగాలి.