Todays Gold Rate: మన దేశ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. మహిళలు ప్రతిరోజు పొదుపు చేసిన డబ్బులతో బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలు అందరికీ షాక్ కు గురి చేస్తున్నాయి. అయితే వీటి ధరలు పెరిగిన లేదా తగ్గినా కూడా కొంతమంది లెక్క చేయకుండా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్లు జరుగుతున్న సందర్భంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం బంగారం ధర తులానికి లక్ష రూపాయలు చేరుకున్న సంగతి తెలిసిందే. కానీ గడిచిన వారం రోజుల నుంచి బంగారం ధరలో కొద్దిగా తగ్గుదల కనిపిస్తుంది. మన దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది. దీంతో మన దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో కూడా బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది.
మన దేశ మార్కెట్లో ఈరోజు పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
ఈరోజు హైదరాబాద్ నగరంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.87,540, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.95,500 గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నగరం తో పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాలలో కూడా ఈరోజు దాదాపుగా ఇవే పసిడి ధరలు ఉన్నాయి.
ఇక చెన్నై మార్కెట్లో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.87,540, 24 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.95,500.
ముంబై మార్కెట్లో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,540, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.95,500.
ఈరోజు డైలీ మార్కెట్ లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,690, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.95,650.
కోల్కత్తా నగరంలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,540, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.95,500.
బెంగళూరు మార్కెట్లో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,540, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.95,500.
ఇక వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నాయి. మన దేశ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.97,900 గా గా ఉంది.