Todays Horoscope: ఈరోజు అదృష్ట రాశులు ఇవే.. నేడు 12 రాశుల దిన ఫలాలు ఇవే

Todays Horoscope
Todays Horoscope

Todays Horoscope: ఈరోజు మే 3, 2025 మేష రాశి వారి ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. వృషభ రాశి వారు ఆర్థికంగా బలపడతారు. వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇవే.

మేషరాశి: ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. కుటుంబంలో శుభపరిణామాలు జరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభ రాశి: వృత్తి మరియు ఉద్యోగం సాఫీగా సాగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈరోజు తీసుకునే నిర్ణయాల వలన మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు పురోగతి సాధించే అవకాశం ఉంది.

మిథున రాశి: ఈరోజు అంతా వీరికి సాఫీగా సాగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్థుల విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక రాశి: వీరికి ఇంటా బయట అనుకూలంగా ఉంది. మీ మాటకు గౌరవం ఉంటుంది. వృత్తి మరియు ఉద్యోగంలో రాబడి బాగా ఉంటుంది. ఏ పని చేసిన విజయం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులలో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

సింహరాశి: వృత్తి మరియు ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. వ్యాపారంలో సాఫీగా సాగుతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి అవుతాయి. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది.

కన్య రాశి: వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని పొందుతారు. ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి మంచి అవకాశాలు వస్తాయి. పెళ్లి తర్వాత అనుకూల సమయం.

తులారాశి: వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మిత్రులకు ఆర్థికంగా సహాయపడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి: ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులు సంతృప్తి చెందుతారు. ఆర్థిక విషయాలన్నీ సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదంలో జాగ్రత్త వహించాలి. వృత్తి మరియు వ్యాపారంలో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి.

ధనస్సు రాశి: కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఇంట బయట మీకు గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.

మకర రాశి: ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఈరోజు అంతా సాఫీగా సాగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. వృత్తి మరియు వ్యాపారంలో ఊహించిన లాభాలు పొందుతారు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.

కుంభరాశి: ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట అనుకూలంగా ఉంది. వృత్తి మరియు వ్యాపారం సాఫీగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆర్థిక విషయాలలో ఎవరికి వాగ్దానాలు చేయకూడదు. స్వల్ప ఆరోగ్య సూచనలు ఉన్నాయి.

మీనరాశి: వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. అధికారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు కూడా విదేశాల నుంచి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు పొందుతారు. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారో. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now