Android16 launch: పదేళ్ల తర్వాత మారిన గూగుల్ లోగో.. ఆండ్రాయిడ్ లో 16 కొత్త అప్డేట్స్ ఏవో తెలుసా…!

Android16 launch
Android16 launch

Android16 launch: చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా గూగుల్ అంటే బాగా తెలుసు. ఏ ఫోన్లో అయినా ఏ కంప్యూటర్లో అయినా గూగుల్ లేకుండా అసలు ఊహించుకోలేము. ఏదైనా సమాచారం తెలియాలంటే ప్రతి ఒకరికి ముందుగా గుర్తొచ్చేది గూగుల్. ఈ మధ్యకాలంలో గూగుల్ సర్చ్ ఇంజిన్ వాడకం బాగా ఎక్కువ అయింది. అయితే తాజాగా గూగుల్ సంస్థ దాదాపు 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా గూగుల్ లోగోను మార్చబోతుంది. 2015, సెప్టెంబర్ 1న చివరిసారిగా గూగుల్ ఐకాన్ మార్పు జరిగిన సంగతి తెలిసిందే. గతంలో కంపెనీ లోగో వైట్ కలర్ లో లోయర్ కేస్ google. ఆ తర్వాత 2015 లో G అనే లోగోను మార్చారు.

అయితే దాదాపు అందరూ కూడా రెడ్, ఎల్లో, గ్రీన్ మరియు బ్లూ కాంబినేషన్లో వచ్చిన ఈ లోగోకు బాగా అలవాటు పడిపోయారు. గూగుల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా G అక్షరం గుర్తొచ్చేలాగా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ లోగో లో ఉన్న నాలుగు కలర్లలో విడివిడిగా అన్నీ కూడా ఒక కలర్ కు మరొక కలర్ కు మధ్య కట్టు ఉన్నట్లుగా సపరేట్గా కనిపించేవి. ప్రస్తుతం గూగుల్ సంస్థ తీసుకొని వచ్చిన ఒక లోగోలో కలర్స్ మధ్యలో కట్టు లేకుండా బ్లెండింగ్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. స్మూత్ బ్లెండింగ్ తో ఉన్న లోగోను ప్రస్తుతం గూగుల్ సంస్థ తీసుకొని వచ్చింది. ఎల్లో కలర్ లోకి రెడ్ కలర్ లో అవుతున్నట్లు అలాగే గ్రీన్ కలర్ లోకి ఎల్లో కలర్ ఫ్లో అవుతున్నట్లు బ్లూ కలర్ లోకి గ్రీన్ కలర్ ఫ్లో అవుతున్నట్లుగా బ్లెండ్ అయ్యి అన్ని కలర్స్ ఉన్నాయి.

ఇది చాలా వైబ్రేట్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే మీరు అప్డేట్ అయినా గూగుల్ ఐకాన్ ను గూగుల్ లో చూడవచ్చు. అలాగే గూగుల్ ఫ్రెష్ లుక్ తో ఆండ్రాయిడ్ 16 అప్డేట్స్ ను కూడా రెడీ చేసింది. వీటిలో పిక్ సెట్టింగ్ పానెల్ ఉంటుంది. మీ మొబైల్ ఫోన్లో స్క్రీన్ ను స్వైప్ చేయగానే కనిపించేలాగా దీనిని తయారు చేశారు. అలాగే వైఫై మరియు బ్లూటూత్ వంటి ఫీచర్లను కేవలం ఒక టచ్ తోనే ఆన్ ఆఫ్ చేసుకునే సదుపాయం కల్పించారు. వైఫై, బ్యాటరీ మరియు 5g సింబల్ ఇలా అన్నీ కూడా లుక్ మారినట్లు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ అప్డేట్ చేయడం వలన స్మార్ట్ ఫోన్లు మరింత స్మూత్ గా మరియు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయని చెప్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now