SBI: మనదేశంలో ఉన్న అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటివరకు ఎస్బిఐ తమ వినియోగదారుల కోసం అనేక రకాల డిపాజిట్ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. తమ వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఎస్బిఐ వాటిని రూపొందించింది. ఎస్బిఐలో రికరింగ్ డిపాజిట్ ల నుంచి యాన్యుటి పథకాల వరకు కూడా ఉన్నాయి. ఈ పథకంలో మీరు కేవలం ఒకసారి డిపాజిట్ చేసినట్లయితే ప్రతి నెల కూడా పెన్షన్ మాదిరిగా నగదు పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేసింది. ఈ స్కీంలో మీరు ఒక్కసారి పెట్టుబడి పెట్టినట్లయితే ప్రతి నెల కూడా 10 సంవత్సరాల వరకు డబ్బులు పొందవచ్చు.
ఎస్బిఐ లో ఉన్న యాన్యుటి డిపాజిట్ స్కీమ్లో మీరు కేవలం ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతినెలా డబ్బులు పొందవచ్చు. మీకు నెలకు ఎంత కావాలో అంత ఆదాయాన్ని స్థిర ఆదాయంగా పొందవచ్చు. భారతీయ పౌరులు ఈ పథకంలో చేరవచ్చు. మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఈ పథకం మెచ్యూరిటీ సమయం. మీరే ఎంచుకున్న మెచ్యూరిటీ సమయం ఆధారంగా ప్రతినెలా మీరు డబ్బులు పొందవచ్చు. మీరు మెచ్యూరిటీ టెన్యూర్ 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలు ఇలా ఏ కాలాన్ని అయినా ఎంపిక చేసుకోవచ్చు.
మీరు మీకు కావాల్సిన ఆప్షన్ను ఎంపిక చేసుకొని ఆ మొత్తం కాలంలో మీరు పెన్షన్ డబ్బులు పొందవచ్చు. కనీసంగా మీరు ఇందులో వెయ్యి రూపాయలు ప్రతినెలా అందుకోవచ్చు. అలాగే గరిష్టంగా ఎంతైనా పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. మీరు పెట్టుబడి పెట్టిన ఆధారంగా ప్రతి నెల మీకు ఆదాయం వస్తుంది. పెద్ద మొత్తంలో మీరు కేవలం ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెడితే ప్రతి నెల మీకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి. కస్టమర్లకు ఈ పథకంలో ప్రత్యేకమైన ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఎస్బిఐ కల్పిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంలో 75% వరకు ఓవర్ డ్రాఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది.