Chanakya Niti: నీతి శాస్త్రంలో ఆచార్య చానిక్యుడు చెప్పిన విధానాలు ఇప్పటి ప్రజలకు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. శత్రువులపై విజయం సాధించాలంటే లేదా కష్టమైన సవాళ్లను ఎదుర్కోవడం వంటివి చేయాలంటే నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యత దృష్టి మరియు ఆచరణాత్మక జ్ఞానం మనకు సరైన మార్గాన్ని చూపుతుందని చెప్పొచ్చు. ఆచార చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో మౌర్య సామ్రాజ్యానికి పునాది వేయడమే కాకుండా మనిషి జీవితంలో ప్రతి రంగంలో కూడా విజయం సాధించడానికి ఎంతో ముఖ్యమైన సూత్రాలను కూడా పొందుపరిచారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చాణిక్యుడి విధానాలు ఎంత సందర్భోచితంగా ఉన్నాయో ఇప్పటికీ కూడా అవి అంతే సందర్భోచితంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు.
ముఖ్యంగా ఆచార చాణిక్యుడి దృష్టి మరియు ఆచరణాత్మక జ్ఞానం శత్రువులపై విజయం సాధించడానికి సరైన మార్గాన్ని చూపుతుంది. శత్రువు బలహీనంగా కనిపించినా కూడా అతనిని తక్కువ అంచనా వేయకూడదు. కొన్ని కొన్ని సార్లు శత్రువు నుంచి అత్యంత ప్రమాదకరమైన దాడులను మనం ఊహించకుండానే ఎదురుకోవలసి వస్తుంది. నేడు బలహీనంగా ఉన్న శత్రువు రేపు బలవంతుడిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడు కూడా అప్రమత్తంగా మరియు సిద్ధంగా ఉండడం చాలా అవసరం.
నీతి శాస్త్రంలో చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి అత్యంత ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకుంటాడు. మనసు శాంతంగా ఉన్నప్పుడు మీ శత్రువు యొక్క కదలికలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ప్రశాంతంగా ఆలోచించడం వలన మీ శత్రువు కంటే ముందు అనేక అడుగులు ముందుకు వెళతారు. శత్రువు యొక్క కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మీ శత్రువు బయట నుంచి సాధారణంగా లేదా అమాయకంగా కనిపించడం అది అతని వ్యూహం కూడా కావచ్చు. నిజమైన విజేతలు సరైన సమయం కోసం వేచి చూస్తారు. పరిస్థితి మనకు అనుకూలంగా లేని సమయంలో కొంత సమయం వరకు వేచి చూడడం కూడా వ్యూహంలో ఒక భాగం అని ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో బోధించబడింది.