Ugadi: ఉగాది పండగకు ప్రభుత్వం గుడ్ న్యూస్ .. అదేంటో వింటే ఆశ్చర్యం

Ugadi
Ugadi

Ugadi: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా హుజూర్నగర్ నుంచి ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం రోజు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ తో కలిసి మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే రేషన్ బియ్యం చాలామంది లబ్ధిదారులు ఉపయోగించడం లేదని అలాగే దొడ్డు బియ్యం కావడంతో డీలర్ల నుంచి బ్లాక్లో అక్కడక్కడ అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఏడాదికి 7000 కోట్ల నుంచి 8 వేల కోట్ల విలువైన బియ్యం దుర్వినియోగం అవుతుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో దాదాపు 3.1 0 కోట్ల మంది ప్రయోజనం పొందాలని లక్ష్యంతో మొత్తం రాష్ట్ర జనాభాలో 85% మందికి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెలకు 6 కిలోల సన్న బియ్యం అందజేస్తామన్నారు. భారతదేశంలో ఇప్పటివరకు ఇంత పెద్ద సంఖ్యలో జనాభాకు ఇంత పెద్ద సంక్షేమ పథకం ప్రవేశపెట్టలేదని తెలిపారు.

సామాజిక న్యాయం కోసం దీనిని ఒక నమూనాగా అభివర్ణించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవడానికి వీలుగా ఉండేలా డ్రెస్ సిస్టం అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. కొత్త రేషన్ కార్డులు కావాలని అనుకున్న వాళ్లకి అర్హతను బట్టి మంజూరు చేస్తామని అలాగే కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రేషన్ కార్డు ఉన్నా లేకపోతే సన్న బియ్యం వాళ్లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందజేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా 2.85 కోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకుంటున్నట్లు వివరించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now