Today Horoscope: శనీశ్వరుడు ఈ రాశుల్లో ప్రవేశించడంతో.. వారికి అధికం అవుతాయి.. ఈ రాశి వారికి మాత్రం లాభ స్థానంలో.. ఈ వారం 12 రాశుల రాశి ఫలాలు

Todays Zodiac Signs
Todays Zodiac Signs

Today Horoscope: శనీశ్వరుడు ఈ రాశుల్లో ప్రవేశించడంతో.. వారికి అధికం అవుతాయి.. ఈ రాశి వారికి మాత్రం లాభ స్థానంలో.. ఈ వారం 12 రాశుల రాశి ఫలాలు..

ఈవారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 5, 2025 వరకు 12 రాశుల రాశి ఫలాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏలినాటి శని ప్రభావం ఉన్నందువల్ల అనేక రకాలుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి లాభ స్థానంలో శని ప్రవేశించడం వల్ల ఆదాయం పెరుగుతుంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈ వారం 12 రాశుల రాశి ఫలాలు ఇలా ఉన్నాయి…

మేషరాశి:

ఏలినాటి శని ప్రభావం కారణంగా అనేక రకాలుగా ఖర్చులు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు ఎక్కువగా పెట్టాలి. ధన స్థానంలో గురువు ఉండడం వలన ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఆదాయం పెరుగుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు మరియు పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి సహకారం పొందుతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో ఆక్టివిటీ ఉంటుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

వృషభరాశి:

లాభ స్థానంలో శని ప్రవేశించడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఈ వారం అంతా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారాల్లో లావాదేవీలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది సరైన సమయం. ఇంట బయట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయంలో ఎవరికీ కూడా వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

మిథున రాశి:

దశమ స్థానంలో శనీశ్వరుడు ప్రవేశించడంతో ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. ఉద్యోగంలో మీ మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారంలో యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోనికి మారడానికి ఇది సరైన సమయం. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి.

కర్కాటక రాశి:

శనీశ్వరుడు భాగ్య స్థానంలో ప్రవేశించడం వల్ల కొన్ని కష్ట నష్టాలు, ఆలస్యాలు, వృధా ఖర్చులు, అదనపు బాధ్యతలు, వ్యయ ప్రయాసాల నుంచి బయటపడతారు. ఉద్యోగం చేసే వాళ్ళకి మరియు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి. తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా రకాలుగా ధన లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సోదరులతో నాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.

సింహరాశి:

అష్టమ శని ప్రారంభమైనందున ప్రతి వ్యవహారంలో కూడా ఆచతూచి ముందుకు వెళ్లాలి. సన్నిహితులు దూరమవుతారు. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి మరియు వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అంతగా సఫలం కావు. అనుకున్న పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్యరాశి:

సప్తమ స్థానంలోనికి శనీశ్వరుడు ప్రవేశించడం వలన అధిక పని భారం, అదనపు బాధ్యతలు, అలవికాని లక్ష్యాలు తప్పవు. జీవిత భాగస్వామికి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు వెనుకబడతాయి. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడి సంపాదించిన దానిలో ఎక్కువ భాగం వృధా అయ్యే అవకాశం ఉంది. వృత్తి మరియు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పని భారంతో పాటు ఫలితం కూడా పెరుగుతుంది. ఆస్తి సమస్య పరిష్కారం అవుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం. ఆరోగ్యం బాగుంటుంది.

తులారాశి:

ఆరవ స్థానంలోకి శని ప్రవేశించడం వలన అనేక సమస్యలు, వివాదాలు తగ్గుముఖం పడతాయి. అనారోగ్యాల నుంచి మరియు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో యాక్టివిటీ పెరుగుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి:

అర్ధాష్టమ శని తొలగిపోయినందు వల్ల జీవితంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి m కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. సంతానయోగం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సోదరులకు ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనస్సు రాశి:

అర్ధాష్టమా శని ప్రారంభమైనందువల్ల ప్రతి పనిలో కూడా శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగానే ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. సొంత ఇంటి ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. శుభకార్యాల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో శుభవార్తలు విని అవకాశముంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి:

ఏలినాటి శని తొలగిపోవడం వలన ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఎదురుచూస్తున్న శుభవార్తలు విని అవకాశముంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకూల మార్కులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు వస్తాయి. పూర్తి మరియు వ్యాపారాలు విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం. గృహ మరియు వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. సోదరులతో ఉన్న ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. వ్యక్తిగత సమస్యలు నిదానంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కుంభరాశి:

శని ద్వితీయ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కష్టానికి తగ్గ ఫలితం లభించదు. ఆదయ ప్రయత్నాలు మందకోడిగా ఉంటాయి. కుటుంబంలో లేని పోనీ సమస్యలు మరియు అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉంది. చేతికి రావాల్సిన డబ్బు ఈ సకాలంలో చేతికి అందగా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలలో విఘ్నాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వివాదాలు మరియు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగిపోతాయి.

మీనరాశి:

శని ప్రవేశం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. వృత్తి మరియు వ్యాపారాలు పర్వాలేదు. కొద్దిపాటి అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆదయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది. ఇతరులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం ఉత్తమం. శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు కూడా అనుకూలంగా ఉంది. వృత్తి మరియు ఉద్యోగాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now