Vastu Tips: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. సంపదను పెంచడంతో పాటు.. గాలిని శుభ్రం చేయడంలో సహకరిస్తాయి తెలుసా..!

Vastu Tips
Vastu Tips

Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువుల గురించి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. అంతేకాదు వాస్తు శాస్త్రంలో ఇంటి లోపల నిర్మాణంలో పెంచుకునే మొక్కల గురించి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇంట్లో అందాన్ని పెంచడంతోపాటు ఇంటికి అదృష్టాన్ని మరియు సానుకూలతను కలిగించే కొన్ని మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిని అందంగా అలంకరించే వాటిలో మొక్కలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మొక్కలు అందాన్ని పెంచడంతోపాటు అదృష్టాన్ని కూడా ఆకర్షిస్తాయి. వాస్తు శాస్త్రంతోపాటు జ్యోతిష్య శాస్త్రం, పురాణ గ్రంథాలలో కూడా మొక్కల ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. మనదేశంలో తులసి మొక్కకు ఉన్న విశిష్ట స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తులసి మొక్కల ఆధ్యాత్మిక ఔషధ గుణాలు ఉన్నాయి.

తులసి మొక్క మతపరమైన ప్రాముఖ్యతకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఈశాన్య దిశలో పెట్టడం చాలా శుభప్రదం. ఇంట్లో శ్రేయస్సు మరియు సానుకూల ప్రవాహాన్ని పెంచే ఉత్తమమైన మొక్కగా మనీ ప్లాంట్ చెప్తారు. ఇది ఇంట్లో సంపద మరియు స్థిరత్వాన్ని ఆకర్షిస్తుంది. ఇంటి లోపల మనీ ప్లాంట్ మొక్క ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. ఇంట్లో మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టాలి. స్నేక్ ప్లాంట్ ఇంట్లో ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. దీనిని షీల్డ్ మొక్క అని కూడా అంటారు. ఇది ఇంట్లో ప్రవేశ ద్వారం దగ్గర లేదా మూలలో పెంచుకోవడం ఉత్తమం. ఇంట్లో ఈ స్నేక్ ప్లాంట్ ను దక్షిణా లేదా ఆగ్నేయ దిశలో పెట్టాలి. గుండ్రని ఆకులు నాణేల వలె కనిపించే మొక్కను జాడే మొక్క అంటారు. ఇది డబ్బును ఆకర్షిస్తుంది. ఇంట్లో అదృష్టం మరియు శుభ సమయానికి చిహ్నంగా ఈ మొక్కని చెప్తారు. దీనిని ఇంటికి ప్రవేశ ద్వారం దగ్గర పెట్టాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now