Chanakya Niti: ఆచార్య చాణుక్యుడి ప్రకారం ఇటువంటి లక్షణాలు.. ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే ఇక అంతే

Chanakya Niti
Chanakya Niti

Chanakya Niti: నీతి శాస్త్రంలో ఆచార్య చాణుక్యుడు చాలా విషయాల గురించి ప్రస్తావించారు. వాటిలో ఒక వ్యక్తి కెరియర్, వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, వైవాహిక జీవితం గురించి ప్రజలకు అవసరమైన ఎన్నో చిట్కాలు ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయి. పురుషులు ఇటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే వారి జీవితం నరకంగా మారుతుంది అంటూ నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. వివాహం అనేది నిండు నూరేళ్ల జీవితం. ఇటువంటివి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పొచ్చు. ఇటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో విఫలమైతే జీవితాంతం బాధపడాలి. చెడు కుటుంబం నుంచి వచ్చిన స్త్రీలను పురుషులు వివాహం చేసుకోకూడదు అంటూ ఆచార్య చాణుక్యుడు తెలిపాడు.

ఆమె చాలా అందంగా మరియు ఎక్కువ డబ్బులు ఉన్నా సరే ఆమె చెడు కుటుంబం నుంచి వచ్చినట్లయితే అటువంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. తన కుటుంబ సభ్యులను గౌరవించని స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. అటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత కుటుంబం విచ్చిన్నమయ్యే అవకాశం ఉంది. స్త్రీ చూడడానికి చాలా అందంగా ఉన్నా కూడా ఆమె ప్రవర్తన తీరు సరిగ్గా లేకపోతే అటువంటి స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. అటువంటి స్త్రీ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే తన భర్తను విడిచి పెట్టొచ్చు.

అబద్ధం చెప్పడంలో చాలా నైపుణ్యం ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే భవిష్యత్తులో భర్తపై కూడా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా భర్త జీవితాన్ని నాశనం చేస్తారు. వ్యంగ్యంగా మాట్లాడే స్త్రీని కూడా పెళ్లి చేసుకోకూడదు. అటువంటి స్త్రీలు భర్త కుటుంబం మొత్తాన్ని అవమానించగలరు. చాణక్య నీతి శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ చూడడానికి చాలా అందంగా ఉన్నా కూడా ఆమె అంతర్గత సౌందర్యం లేకపోతే ఆమె ఆలోచనలు మంచివి కాదు అని అర్థం. అటువంటి స్త్రీని కూడా పెళ్లి చేసుకోకూడదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now