Todays Gold Rate: గత నాలుగు రోజుల నుంచి తగ్గుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో లక్ష రూపాయలను దాటిన తులం బంగారం ధర ఇప్పుడు తగ్గుతూ కొంత దిగి వచ్చింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉధృత పరిస్థితులు తగ్గిన కారణంగా అంతర్జాతీయంగా బంగారం మరియు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఆల్ టైం హై రికార్డుకు చేరుకున్న తర్వాత తులం బంగారం ధర మళ్ళీ తగ్గుతూ 5000 వరకు దిగి వచ్చింది. అయితే గతంలో తులం పసిడి ధర ₹1,2000 పైగా చేరుకుంది. ప్రస్తుతం తులం పసిడి ధర 97000 గా కొనసాగుతుంది.
అయితే అంతర్జాతీయంగా పరిస్థితులు సర్దుమనగడంతో అలాగే డిమాండ్ కూడా తగ్గడంతో భవిష్యత్తులో బంగారం ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశ మార్కెట్లో పసిడి మరియు వెండి కి డిమాండ్ ఏ సమయంలో అయినా ఒకే విధంగా ఉంటుంది. కానీ మన దేశ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బంగారం వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. జూన్ 29, ఆదివారం రోజున మన దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.97,420, ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.89,300 గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.1,07,800 గా ఉంది.
మన దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలు ముంబై, చెన్నై, బెంగళూరు మరియు కోల్కత్తా వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.97,420, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.89,300, కిలో వెండి ధర రు.1,17,800 గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో ఉన్న పలు ముఖ్యమైన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు వరంగల్ లో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.97,420, ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.89,300, కిలో వెండి ధర రూ.1,17,800.