Acharya Chanikya: మనిషి జీవితం గురించి ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపారు. ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అలాగే కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఆచార్య చాణుక్యుడు తెలిపారు. ఈ మధ్యకాలంలో కూడా ఆచార్య చాణిక్యుడు చెప్పిన నియమాలను చాలామంది ఫాలో అయ్యి జీవితంలో విజయం సాధిస్తున్నారు. నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం కష్టం రావచ్చు అని గ్రహించిన వెంటనే ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
మీ దగ్గర ఉన్న ధనం మొత్తాన్ని ఒకే చోట పెట్టుబడి పెట్టకూడదు. ఇలా పెట్టినట్లయితే మొత్తం ఒకేసారి పోయే అవకాశం ఉంది. అలా కాకుండా మొత్తం ధనాన్ని వేరే వేరే చోట్ల పెట్టుబడి పెట్టినట్లయితే ఒకటి పోయినా కూడా మిగిలినవి జాగ్రత్తగా ఉంటాయి. మీతో మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మిత్రులు లాగే కనిపిస్తారు. కానీ నిజమైన మిత్రులు ఎవరో గ్రహించాలి.
ఒకవేళ మీకు శత్రువులు ఉన్నట్లయితే కష్టాలు తప్పవు. జీవితంలో మీకు కష్టాలు రాకూడదు అనుకుంటే విద్య, డబ్బు అలాగే సమాజంలో మంచి పేరు ఉండాలి. మీకున్న అహంకారం తొందరపాటు మీకు కష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే ప్రతి సందర్భంలో కూడా చాలా ఓర్పుతో వ్యవహరించాలి. ఆచార్య చాణిక్యుడు చెప్పిన ఈ మూడు సూత్రాలను పాటించడం వలన జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఏదైనా కష్టం వస్తుంది అని ముందుగా మీరు గ్రహించిన కూడా ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి.