Bank Deposit Rules: బ్యాంకులో ₹50వేల కంటే ఎక్కువ జమ చేస్తే.. ఇక అంతే.. కొత్త రూల్స్

Bank Deposit Rules
Bank Deposit Rules

Bank Deposit Rules: చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బును ఇంట్లో ఎందుకు అని బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ రూల్స్ మారిపోయాయి. మీ బ్యాంకు ఖాతాలో మీరు రూ.50 వేలు డిపాజిట్ చేసినా కూడా ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంకు ఖాతా నుంచి ప్రతి ఒక్కరూ డబ్బులు లావాదేవీ లను చేస్తూ ఉంటారు. ఇటీవల బ్యాంకు ఖాతాలో నుంచి నగదు జమ చేయడానికి సంబంధించిన కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి.

మారిన నియమాల ప్రకారం మీ బ్యాంకు ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి నగదును జమ చేసినట్లయితే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు అందుకోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన మార్గదర్శకాలు ను బ్యాంకులు అన్ని పాటిస్తున్నాయి. తాజాగా బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ కి సంబంధించి మరింత పారిదర్శకత ఉండేలాగా రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే బ్యాంకు అధికారులకు తప్పనిసరిగా పాన్ కార్డు నెంబర్ తెలియజేయాలి.

అలాగే రోజువారి నగదు డిపాజిట్ పరిమితి కూడా లక్ష రూపాయలకు మించి ఉండకూడదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ప్రస్తుత నియమాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వరకు నగదును ఎటువంటి హెచ్చరిక లేకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ మీ మొత్తం ఖాతాలలో కలిపి డబ్బులు రూ.10 లక్షలు మించి దాటితే ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు అందించాలి.

ఆర్.బి.ఐ జారీ చేసిన నిబంధనల మేరకు మీరు డిపాజిట్ చేసిన డబ్బులు లిమిట్ దాటితే మీకు ఆదాయపు పన్ను రిటర్న్స్ వివరాలను అడుగుతుంది. ఒకవేళ మీరు సరైన వివరాలను అందించలేక పోతే ఆదాయపు పని శాఖ అధికారులు మీ ట్రాన్సాక్షర్ ని ట్రాక్ చేస్తారు. వాటిలో ఏమైనా లోటుపాట్లు కనిపిస్తే మీకు భారీ జరిమానా లేదా చట్టపరమైన చర్యలు తప్పవు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now