Home తాజా వార్తలు Todays Gold Rate Review: మార్కెట్లో గోల్డ్ ధరలపై రివ్యూ..

Todays Gold Rate Review: మార్కెట్లో గోల్డ్ ధరలపై రివ్యూ..

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate Review: మార్కెట్లో గోల్డ్ ధరలపై రివ్యూ..

ప్రస్తుతం దేశంలో పసిడి ధరలు సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి పసిడి ధరలు చేరుకున్నాయి. ఇటీవలే బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన తులం పసిడి ధర తొలిసారిగా లక్ష రూపాయలు దాటిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంత తగ్గినట్లే తగ్గిన పసిడి ధరలు మళ్ళీ పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనాలంటే భయపడుతున్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో కూడా గురువారం రోజు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం రోజు పసిడి ధరలు లక్ష రూపాయలు దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇక బుధవారం రోజు పసిడి ధరలో తగ్గుదల కనిపించింది. అయితే వీటి ధరలు తగ్గుదల ఉంటుందని అనిపించింది. కానీ అలా ఏమీ జరగకుండా గురువారం రోజు పసిడి ధర మళ్లీ పెరిగింది. దీనికి ముఖ్య కారణం డాలర్ ఇండెక్స్ పతనం అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో డాలర్ ఇండెక్స్ పతనం ప్రభావం కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే కొత్త రికార్డు స్థాయికి పసిడి ధర చేరుకుంటుంది అని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పసిడి ధరలు 200 రూపాయలు పెరిగి 10 గ్రాములకు నేడు 99,400 రూపాయలకు చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ తెలిపింది. బుధవారం 99.9 శాతం స్వచ్ఛత ఉన్న పసిడి ధర లక్ష్య స్థాయి నుండి యు టర్న్ తీసుకొని రూ.2,400 తగ్గి రు.99,200 కు చేరుకుంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత ఉన్న పసిడి ధర తులానికి రూ.200 పెరిగి రు.98,900 కు చేరుకుంది. ఇక గురువారం రోజున వెండి ధరలు కిలోకు 700 పెరిగి రూ.99,900 కు చేరుకున్నట్లు తెలుస్తుంది. బుధవారం రోజున అమెరికా ట్రెజరీ కార్యదర్శి మాట్లాడుతూ అమెరికా, చైనా మధ్య ఇటీవల నెలకొన్న వాణిజ్య ప్రతిష్ట మరికొంత కాలం కొనసాగవచ్చని తెలిపారు.

ట్రంప్ కొత్త సుంకాలు..

ఇది ఇలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రానున్న రెండు మూడు వారాలలో చైనాకు కొత్త సుంకాల రేట్లను అందుకోవచ్చు అని తెలిపారు. సాంకేతిక దిద్దుబాటు వలన జరిగిన కొన్ని కారణాల వలన బంగారం ధర రికార్డు స్థాయి నుంచి పడిపోయిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ మరియు బేసెంట్ వ్యాఖ్యలు సురక్షితమైన ఆస్తిగా బులియన్ మార్కెట్లో డిమాండ్ ను పునరుద్ధరించడానికి సహాయపడుతున్నాయని కమోడిటీ మార్కెట్ నిపుణులు తెలిపారు. అలాగే అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మేత మాట్లాడుతూ స్వల్పంగా తగ్గిన తర్వాత లాభాల బుకింగ్ కారణంగా బంగారం రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now