Driving Licence: ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ పొరపాటున పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన కూడా ఇకపై మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ప్రభుత్వ రవాణా పోర్టల్ కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్ ని ఎంపిక చేసుకొని అప్లై ఫర్ డూప్లికేట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీరు చెందిన రాష్ట్రాన్ని ఎంచుకొని అక్కడ ఉన్న వివరాలను పూర్తి చేయాలి.కొంతమంది పొరపాటున తమ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకుంటారు. అటువంటి సమయంలో వాళ్లు చాలా ఆందోళన పడుతూ ఉంటారు. కానీ డ్రైవింగ్ లైసెన్స్ కనిపించకపోతే మీరు వెంటనే కొన్ని ముఖ్యమైన పనులను చేయాలి.
ఇలా చేయడం వలన మీ పరిస్థితి అదుపులోకి వస్తుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన వెంటనే మీరు మీకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్లు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. దానికి సంబంధించిన ఒక కాపీని మీ దగ్గర పెట్టుకోవాలి. ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు ప్రభుత్వ రవాణా హోటల్ కి వెళ్లి డిఎల్ అప్లై చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్ ని ఎంపిక చేసుకొని డూప్లికేట్ ఎంపికను ఎంచుకోవాలి.
మీ రాష్ట్రాన్ని ఎంచుకున్న తర్వాత వివరాలను పూర్తి చేయాలి. మీ దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ తోపాటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోను అందించాలి. ఆ తర్వాత 200 నుంచి 500 వరకు రుసుము కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఇంటికి సమీపంలో ఉన్న ఆర్టీవో కి వెళ్లి ఈ పత్రాలను సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులలో డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్సు మీ ఇంటికి పోస్టు ద్వారా వస్తుంది. మీరు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.