Todays Gold Rate: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు…ఈరోజు తులం ఎంతంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: దేశీయంగా మరియు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల కారణంగా బంగారం మరియు వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గతంలో బంగారం ధర ఆల్ టైం హై రికార్డుకి చేరుకున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కూడా బంగారం ధరలలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారి మనసులో గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలామంది బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కానీ బంగారం ధరలలో మార్పులు వాళ్లకు అయోమయానికి గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల వలన మాత్రమే కాకుండా ద్రవయోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వలు, వడ్డీ రేట్ల మీద కూడా బంగారం ధరలో ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో ప్రస్తుతం బంగారం ఒక మంచి పెట్టుబడిగా కూడా అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పసిడికి చాలా డిమాండ్ ఏర్పడింది. మే 12, 2025 తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రధాన ప్రాంతాలలో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.98,670, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,440.

విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, వరంగల్ మరియు రాజమండ్రిలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీ మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.98,820, 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,590.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఈరోజు స్వచ్ఛమైన పది గ్రాముల గోల్డ్ ధర రూ.98,670, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,440.

దేశీయ మార్కెట్లో బంగారం తర్వాత వెండిని చాలా విలువైన లోహంగా భావిస్తారు. వెండిని కూడా పలు ఆభరణాలు, వంట పాత్రలు, నాణేల తయారీలో ఉపయోగిస్తారు. మన దేశ ప్రజలు బంగారం తర్వాత అత్యధికంగా కొన్ని లోహం వెండి అని చెప్పడంలో సందేహం లేదు. ఇంట్లో పెళ్లిళ్లు,ఫంక్షన్స్ ఏ సందర్భం అయినా కూడా బంగారం తర్వాత మన దేశ ప్రజలు వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం వెండి ధరలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ డాలర్ తో పోల్చినప్పుడు రూపాయి విలువ పడిపోయినట్లయితే అంతర్జాతీయ ధరలు స్థిరంగా కొనసాగుతున్న సమయంలో వెండి ధర మరింత పెరుగుతుంది. ఈరోజు మార్కెట్లో కిలో వెండిపై ₹100 తగ్గినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ తో సహా పలు తెలుగు ప్రాంతాలలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,900. దేశంలోని పలు ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్కత్తా మరియు బెంగళూరు వంటి నగరాలలో నేడు కిలో వెండి ధర రూ.98,900.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now