Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు పండితుడు మరియు గొప్ప రాజకీయ వ్యూహకర్త అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆచార చాణిక్యుడు నీతి శాస్త్రాన్ని రచించాడు. చాలామంది కూడా ఆచార చాణిక్యుడి నీతి శాస్త్రంలో పొందుపరిచిన విషయాలను అనుసరిస్తారు. నీతి శాస్త్రంలో ఒక మనిషి విజయవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకున్నట్లైతే వారు నీతి శాస్త్రంలో ఉన్న కొన్ని విషయాలను అనుసరించాలి అని చాలామంది చెప్తుంటారు. సామాన్య యువకుడిని ఒక రాజుగా చేసిన చానుక్యుడి తంత్రం ఇప్పటి పాలకులకు కూడా అనుసరణీయం అని చాలామంది నమ్మకం. నీతి శాస్త్రంలో ఆచార్య చానిక్యుడు పొందుపరిచిన కొన్ని విధానాలను అనుసరించడం వలన సరైన వ్యూహంతో శత్రువును కూడా చావు దెబ్బ కొట్టవచ్చు అని చెప్పవచ్చు.
మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాల గురించి ఆచార చాణిక్యుడు నీతి శాస్త్రంలో పొందుపరిచాడు. దశాబ్దాల క్రితం ఎంతో సందర్భోచితంగా ఉన్న ఆచార చాణిక్యుడి నీతి శాస్త్రం ఇప్పటికీ కూడా అంతే సందర్భోచితంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. శత్రువుని జయించాలంటే ఏ విధానాన్ని అనుసరించాలో ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. ఈ నియమాలను పాటించడం వలన మీ శత్రువు మీ తెలివితేటలను ఒప్పుకొని అతను కూడా మీ మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఒక మనిషి మీరు చెప్పిన మాటలను వినాలన్న మీ మాటలతో అతను ఏకీభవించాలన్నా కూడా ముందుగా ఆ మనిషిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ శత్రువు యొక్క ఆలోచనలు, స్వభావం, భావద్వేగాలు మరియు బలహీనతలు వంటివి మీరు ముందుగా తెలుసుకోవాలి. అటువంటి సమయంలో మీ శత్రువు కూడా మీకు ఆమోదయోగ్యమైనదిగా భావించే విషయాల గురించి తెలుపుతారు. నేరుగా ఎవరికి కూడా ఆదేశాలను ఇవ్వకూడదు. నేరుగా మీరు ఏమైనా చెప్తే వారు నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఆ అంశం పైన నెమ్మదిగా సంభాషణ మొదలుపెట్టి మీ అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఇలా చేస్తే అవతలి వ్యక్తి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగానే అర్థం చేసుకొని స్వయంగా ఆ పని చేసే ప్రయత్నం చేస్తాడు. ఏ పని చేయాలన్నా కూడా ముందుగా సరైన సమయం చూసుకోవాలి.