Free Gas Cylinder: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేద మరియు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో కొన్ని పథకాలకు షరతులు కూడా విధించింది. ఈ పథకాలలో ఒకటి ఉచిత గ్యాస్ పథకం. తాజాగా దీని గురించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. సరైన సమయంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మీకు గ్యాస్ సిలిండర్ కట్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీపం 2 పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరిన లబ్ధిదారులకు కొన్ని నిబంధనలతో ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
అయితే మార్చి 31 లోపల తప్పకుండా బుక్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోలేదు వాళ్ళు ఈ నెలాఖరిలోగా తప్పకుండా బుక్ చేసుకోవాలి. ఇచ్చిన గడువులోపు బుక్ చేసుకోకపోతే లభించే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఏడాదిలో మూడు ఉచిత సిలిండర్లు పొందాలంటే సకాలంలో బుక్ చేసుకోవడం తప్పనిసరి.
ఇప్పటివరకు ఎవరైతే గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోలేదు వాళ్ళు మార్చి 31 లోపు తప్పకుండా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలి. ఈ గడువు పూర్తయితే మూడు సిలిండర్లలో ఒకటి రద్దు అవుతుంది. ఏప్రిల్ నెల నుంచి రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 97 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ ను పొందారు. ఇంకా బుక్ చేయని వారు వెంటనే చేసుకోకపోతే ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ను పొందడానికి ఇదే చివరి అవకాశం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ పథకాలలో దీపం 2 పథకం కూడా ఒకటి. అయితే లబ్ధిదారులు ఈ పథకా న్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటించాల్సి ఉంటుంది.