Business Idea: తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. రోజు సాగే వ్యాపారం

Business Idea
Business Idea

Business Idea: ఒకరిపై ఆధారపడకుండా తనకు తానుగా తన కాళ్లపై నిలబడి తక్కువ పెట్టుబడితో లాభం పొందాలనుకోవడం తప్పుకాదు. ప్రతి నెల మంచి లాభం వచ్చే విధంగా వ్యాపారం చేయాలనుకుంటాం.. ఇందుకు చాలా రకాల లాభసాటి మార్గాలు ఉన్నాయి. ఒకరి చేతి కింద పనిచేయడం కంటే సొంతంగా వ్యాపారం చేసి జీవించాలి అనుకునే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వ్యాపార ఆలోచన..

మనం చేసే ఏ వ్యాపారమైన ₹ 10 రూపాయల పెట్టుబడికి ₹100 రూపాయల లాభం రావాలని ఆలోచిస్తాం. ఇప్పుడు మీకు చెప్పబోయే వ్యాపారం కూడా అలాంటిదే. మనం చేసే పనుల్లో తప్పు లేనప్పుడు మనకు ఆ వ్యాపారం సంతృప్తినిస్తుందంటే ఆనందంగా వ్యాపారం చేసుకుంటాం. ముఖ్యంగా ఈ వ్యాపారానికి ఎలాంటి పని ఒత్తిడి ఉండదు అలాగే కూలీలు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. ఒకరిద్దరూ కలిసి చేసుకునే వ్యాపారం. కానీ ఉదయం పూట ఒక్క 4 గంటలు కష్టపడితే ప్రతి నెల లాభసాటిగా మీరు చేసే వ్యాపారంతో మంచి లాభాలను గడించవచ్చు. లేదంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ వ్యాపారాన్ని చేసే అవకాశం కూడా ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సు వారైనా ఈ వ్యాపారాన్ని సులభంగా చేయవచ్చు.

నిత్యజీవితంలో ఆధునికతకు తగ్గట్టుగా అభివృద్ధి చెందుతున్న దశలో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరిగెడుతూ ఎవరికి నచ్చిన వ్యాపారాన్ని వారు చేస్తున్నారు. కొంతమంది లక్షల్లో పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో లాభాలు పొందేందుకు వ్యాపారాలు చేస్తున్నారు. కానీ మనకు ఇక్కడ చేయబోయే ఈ వ్యాపారానికి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. కేవలం మీరు చేయాల్సిందల్లా ఉదయం పూట లేచి మన ఊరు, నగరంలోని కూరగాయల మార్కెట్ కు వెళ్లి తక్కువ ధరకు రైతులు తీసుకువచ్చే కూరగాయలను గంపగుత్తగా (Holesale) గా కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకెళ్లండి. తర్వాత మీరు నివసిస్తున్న చుట్టుపక్కల చాలామంది స్వయంగా మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకునేవారు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే ప్రతినిత్యం ఉద్యోగరీత్యా వెళ్లాల్సిన చాలామంది రెడీమేడ్ ఫుడ్ కు అలవాటు పడుతూ కాలం వెళ్ళదీస్తున్నారు. అలాంటి వారికోసం మీరు ప్రతినిత్యం మార్కెట్ కి వెళ్లి తీసుకొచ్చిన తాజా కూరగాయలతో ఇంటి వద్ద కర్రీ (Curry) పాయింట్ ఏర్పాటు చేసి విక్రయిస్తే ఈ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఇందులో మరొక ఉపయోగం కూడా ఉంది. రైతుల వద్ద నేరుగా మీరు కూరగాయలను కొనుగోలు చేస్తారు, కాబట్టి తక్కువ ధరకే మీకు కూరగాయలు లభిస్తాయి. చుట్టుపక్కల వారికి మీరు మార్కెట్ నుండి తీసుకువచ్చిన కూరగాయలను విక్రయించిన మీకు లాభం ఉంటుంది.

ఈ వ్యాపారానికి కేవలం మీరు పెట్టుబడి పెట్టాల్సింది వందల్లో ఉంటే ప్రతినెల మీరు వేలల్లో సంపాదించవచ్చు. ఎలా అంటారా సుమారుగా మార్కెట్లో కిలో టమాటాలు ₹ 20 రూపాయలు ఉంటే రైతుల వద్ద మీకు 50 రూపాయలకే 8 కిలోల బరువుతో ఉన్న గంప (పెట్టీ) గంపెడు టమోటాలు వస్తాయి. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, ఆకుకూరలు మొదలైన కూరగాయలను రైతుల వద్ద నేరుగా తక్కువ ధరకే కొనుగోలు చేసి మీరు లాభాలను పొందవచ్చు.

కర్రీ, రోటి పాయింట్..

మార్కెటింగ్, ఉద్యోగరీత్యా వెళ్లేవారు చాలామంది వంట చేసుకుని ఉదయం పూట ఆఫీసులకు వెళ్లాలంటే కష్టం. అలాంటి వారికోసం ఒక మంచి స్థలం చూసి కర్రీ అండ్ రోటి పాయింట్ పెట్టి స్వయంగా మీరు వండి వ్యాపారం చేస్తే కూడా బాగానే లాభాలు ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వ్యాపారాలు స్ట్రీట్ ఫుడ్ (Street Food)అనే పేరుతో చాలా పాపులర్ అయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి వందల్లో పెట్టుబడి పెట్టే ఈ వ్యాపారానికి ప్రతినెల వేలల్లో లాభాలు ఉంటాయి. ప్రతినిత్యం కొనసాగే ఈ వ్యాపారానికి ఎలాంటి ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now