Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..12 రాశుల వారి వార ఫలాలు ఎలా ఉన్నాయంటే

Weekly Horoscope
Weekly Horoscope

Weekly Horoscope: వార ఫలాలు చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఈ వారం ( మార్చి 16, 2025) మేష రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వృషభ రాశికి చెందిన వాళ్లు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వాళ్ల అదనపు ఆదాయ మార్గాలు కూడా సజావుగా సాగుతాయి. 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషరాశి: వీళ్లకు గురు, శని అలాగే కుజుడు అనుకూలంగా ఉండటం వలన కొన్ని ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నం చేయడం వలన నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందవచ్చు. ఇష్టపడిన వారితో పెళ్లి కూడా కుదురుతుంది. వీళ్ళ ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా మరియు ప్రోత్సాహకరంగా సాగుతుంది. ఈ రాశి వారు వృత్తి మరియు వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలను పొందుతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగడంతో పాటు ఎదురుచూస్తున్న మంచి శుభవార్తలు కూడా వింటారు. విదేశీయానానికి ఇది సరైన సమయం. ఈ రాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

వృషభ రాశి: శుక్రుడు లాభ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. శుక్రుడు మరో మూడు గ్రహాలతో కలిసి ఉండటం వలన ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకో గలుగుతారు. అదనపు ఆదాయం మార్గాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సాయం చేస్తారు. ఈ రాశి వారి ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులు మంచి ఆఫర్లను పొందుతారు. వ్యాపారం చేసే వారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా నిలకడగా సాగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసే వాళ్లు కొద్దిగా నష్టాల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు ఇది సానుకూల సమయం.

మిథున రాశి: వీళ్లకు నాలుగు శుభగ్రహాలతో దశమ స్థానం బలంగా ఉన్నందున ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా ఇది సరైన సమయం. అదాయపరంగా కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామం ఏర్పడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది సరైన సమయం. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో పాటు ఒక ప్రముఖుడిగా గుర్తింపు కూడా పొందుతారు.

కర్కాటక రాశి : వీళ్లకు భాగ్య స్థానంలో ఉచ్చ శుక్రుడి తో సహా నాలుగు గ్రహాలు యుతి చెందడం మరియు లాభ స్థానంలో గురువు సంచారం చేయడం వలన వీళ్లు పట్టిందల్లా బంగారం అవుతుందన్నట్టుగా ఈ వారం రోజులు ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఆశించిన ఉద్యోగం కూడా లభిస్తుంది. పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. వృత్తి మరియు వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. తోబుట్టువులతో ఉన్న వివాదాలు,అపార్ధాలు తొలగిపోయి మంచి సఖ్యత కుదురుతుంది. అయితే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి : శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం, గురువు దశమ స్థానంలో అలాగే కుజుడు లాభ స్థానంలో సంచారం వల్ల వీళ్లకు ఉద్యోగంలో హోదా మరియు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగం లోనికి మారడానికి ఇది సరైన సమయం. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు లభిస్తాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.

కన్య రాశి: సప్తమ స్థానంలో నాలుగు గ్రహాలు యుతి చెందడం అలాగే గురువు భాగ్య స్థానంలో సంచారం చేయడం వలన వీళ్లకు అనుకున్న పనులు పూర్తవుతాయి. వారం అంతా ఉత్సాహంగా సాగుతుంది. వ్యాపారాలలో లాభాలు కూడా ఆశించవచ్చు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. షేర్లు లేదా ఇతర లావాదేవీల వల్ల లాభాలు పొందుతారు. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా సజావుగా సాగుతుంది.

తులారాశి : నాలుగు గ్రహాలతో ఆరవ స్థానం బలంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారాల్లో పోటీదారులపై వీళ్లు పై చేయి సాధిస్తారు. మీ సలహాల వలన బంధువులు బాగా ప్రయోజనం పొందుతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చిక రాశి: పంచమ స్థానంలో శుక్రుడు నాలుగు గ్రహాలు ఉండడం వలన వృత్తి మరియు ఉద్యోగాల్లో మీ ప్రతిభా సమర్థత బాగా రాణిస్తాయి. మంచి గుర్తింపుతో పాటు హోదా కూడా పెరుగుతుంది. సంతానయోగం కలిగే అవకాశం ఉంది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది.నిరుద్యోగులు తమ సొంత ఊరిలోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది.

ధనస్సు రాశి : గురువు శుక్రుడుతో పరివర్తన చెందడం అలాగే శని తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది. విలాస జీవితం గడుపుతారు. అధికారులు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. డాక్టర్లు మరియు లాయర్లు వంటి వృత్తుల వారికి విశ్రాంతి దొరకని పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను పరిష్కరించుకొని లాభం పొందుతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. అయితే ధనపరంగా ఎటువంటి వాగ్దానాలు చేయకూడదు. స్వల్ప అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది.

మకర రాశి : శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయానికి లోటు ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో పని భారం ఇబ్బంది పెడుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారంలో శ్రమ ఎక్కువ మరియు ఫలితం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించాలి. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది.

కుంభరాశి : ధనస్థానం బలంగా ఉండడం వలన ఆదాయానికి లోటు ఉండదు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభపరిణామాలు ఏర్పడతాయి. మాటకు విలువ లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పని భారం కొంచెం పెరుగుతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు పొందుతారు. ఎవరితోనో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

మీన రాశి : తృతీయ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి మరియు ఉద్యోగాలలో ప్రభావం పెరుగుతుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్తారు. ప్రయాణాల వల్ల లాభాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఉద్యోగం లభిస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now