Vastu Tips: మీ పిల్లలు చదువులో రాణించాలంటే.. ఇంట్లో స్టడీ రూం.. ఏ దిశలో ఉండాలో తెలుసా..!

Vastu Tips
Vastu Tips

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం చాలామంది ఇంటిని నిర్మించుకుంటారు. అయితే వాస్తు శాస్త్ర నియమాలు కేవలం ఇంటిని నిర్మించడంలో మాత్రమే కాదు ఇంట్లో ఉండే అనేక వస్తువులకు సరైన దిశను కూడా సూచిస్తుంది. ఇంట్లో ఉండే అన్ని సమస్యలకు వాస్తు శాస్త్రం నియమాలను పాటిస్తే సరిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించినట్లయితే పిల్లలు కూడా చదువులో విజయం సాధిస్తారు. పిల్లలకు చదువు మీద ఏకాగ్రత ఉండేందుకు అలాగే చదువుపై పూర్తి దృష్టి పెట్టేందుకు పిల్లలు చదువుకునే గదిలో వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. మనిషి జీవితంపై వాస్తు శాస్త్రం చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో వారి మనసు తరచుగా చలిస్తూ ఉంటుంది.

చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు చదువుకునే గదిలో కొన్ని నియమాలను పాటించినట్లయితే పిల్లలు పూర్తి ఏకాగ్రతతో చదువు మీద దృష్టి పెడతారు. పిల్లలు చదువుకునే గదిని ఎప్పుడు కూడా చిందరవందరగా పెట్టకూడదు. తల్లిదండ్రులు లేదా పిల్లలు తమ గదిని చాలా నీట్ గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే అనవసరమైన వస్తువులను కూడా పిల్లలు చదువుకునే గదిలో పెట్టకూడదు. చిందరవందరగా ఉండే గదిలో సానుకూల శక్తి ప్రవాహం తగ్గిపోతుంది అని చెప్తారు.

అటువంటి క్రమంలో పిల్లల కు చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. అలాగే ఇంట్లో ముఖ్యంగా పిల్లలు చదువుకునే గది ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంటే చాలా మంచిది అని నిపుణులు చెప్తున్నారు. ఈ దిశలలో కూర్చొని చదువుకోవడానికి చాలా ఉత్తమమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఏకాగ్రతకు ఈ దిశ పరిగణించబడుతుంది కాబట్టి పిల్లలు ఈ దిశలో కూర్చొని చదువుకుంటే వారి మనసు చలించకుండా పూర్తి ఏకాగ్రతతో చదువు మీద దృష్టి పెడతారు. అలాగే వాస్తు ప్రకారం పిల్లలు చదువుకునే గది రంగు కూడా ఉండాలి. మనిషి జీవితంపై రంగులు చాలా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి లేదా నీలం రంగు లేదా లేదా ఆకుపచ్చ రంగు లేదా తెలుపు రంగులో పిల్లలు చదువుకునే గది ఉండాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now