Metpally: ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు

Metpally
Metpally

Metpally: మెట్ పల్లి, మే19 (ప్రజా శంఖారావం): ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. అడ్డగోలుగా అక్రమ మోరం దందా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులకు అధికార పార్టీ నాయకులు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది. అక్రమార్కుల తాకిడికి గుట్టలు కనుమరుగవుతున్నాయి. మెట్ పల్లి మండలంలోని చెర్లకొండాపూర్ ఒడ్డెర కాలనీ వద్ద వున్నా ప్రభుత్వ భూమి గుట్ట నుండి నిత్యం రాత్రి వేలలో మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ…పరిధిలో ఉండే గుట్టలను,కొండలను మొరం తవ్వకాలతో యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.అభివృద్ధి మాటున అక్రమార్కులు మొరం మట్టిని తరలించుకు పోతున్నారు.

గుట్టలు,ప్రభుత్వ భూములు ఆనవాళ్లు కోల్పోతున్నా..సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.తవ్వకాలు జరుగుతుండంతో పకృతి సంపదకు చెందిన విలువైన గుట్టలు మాయం అవుతున్నాయి.ఈ తవ్వకాలకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.విలువైన ప్రకృతి సంపదను అడ్డగోలుగా అక్రమార్కులు కొల్ల గొడుతుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సైతం గండి కొడుతున్నారు.పట్టణంలో జరుగుతున్న వెంచర్లలో మొరం అడ్డగోలుగా తరలించుకుపోవడంతో దశలవారీగా గుట్టలు పూర్తిగా కరిగిపోయే పరిస్థితి తయారైంది.

గుట్టల ప్రాంతాల్లో పెద్ద పెద్ద బండరాళ్లతో పాటు భారీ స్థాయిలో లోతైన గుంతలు దర్శనమిస్తున్నాయి. ఈ రెండు గుట్టల ఏరియాల్లో కనుచూపుమేర చూసినా ప్రస్తుతం సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రజలకు తట్టెడు మట్టి సైతం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అక్రమ మొరం మాఫియాకు అధికారుల అండదండలు కూడా ఉన్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.గ్రామానికి చెందిన పలువురు డివిజన్ స్థాయి అధికారులకు,పోలీస్ లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రకృతి సంపదను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ అక్రమ మొరం దందా పై ఎక్స్ వేదికగా తెలుగు స్కైబ్ ట్వీట్ చేసిన విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now