UPI Payments: ఈ ఆధునిక యుగంలో మన దేశ ప్రజలందరూ కూడా పేమెంట్స్ చేయడానికి నగదుకు బదులుగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ఆప్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఒక్కోసారి వాళ్ళు చేసే చిన్న పొరపాటుతో ఆ నగదు వేరే ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా వెళ్ళిన సొమ్మును ఎలా రిటర్న్ పొందాలో మనలో చాలామందికి తెలియదు. చిన్న మొత్తంలో అయితే కొంతమంది పట్టించుకోరు. కానీ ఒకవేళ పెద్ద మొత్తంలో నగదు వేరే ఒకరికి ట్రాన్స్ఫర్ అయితే ఎలా రిటర్న్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకింగ్ నిపుణులు ఒకవేళ మీరు పొరపాటున యూపీఐ ఆప్ ద్వారా ఒకరికి పంపాల్సిన నగదును మరొకరికి పొరపాటున పంపించినట్లయితే ఎటువంటి భయం అవసరం లేదని చెప్తున్నారు. పొరపాటున మీరు పంపించిన సొమ్ము మీరు రిటర్న్ పొందడానికి మీరు సొమ్ము పంపిన వ్యక్తి సహకారంతోపాటు మీకు బ్యాంక్ నిబంధనలు కూడా ఆధారపడి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఎంపీసీఐ ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి అనేక మార్గదర్శకాలను ప్రజలకు అందించాయి.
మీరు సొమ్మును ట్రాన్స్ఫర్ చేసిన యాప్ ఓపెన్ చేసి అందులో ట్రాన్సాక్షన్ హిస్టరీని ఒకసారి తనిఖీ చేయాలి. మీరు డబ్బు పంపిన గ్రహీత వివరాలను ధ్రువీకరించుకోవాలి. ఆ లావాదేవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. మీరు పొరపాటున పంపిన నెంబర్ కు సంప్రదించి ఆ వ్యక్తిని మీ సొమ్ము రిటన్ చేయమని అభ్యర్థించాలి. అలాగే మీకు ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రతి అప్ లో కూడా కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఆ యాప్ ప్రొఫైల్ లో వెళ్లి ప్రాబ్లం విత్ పేమెంట్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని సమస్యను వాళ్లకు వివరించాలి. మీ సంబంధిత బ్యాంక్ కస్టమర్ కేర్ కు కూడా సంప్రదించి మీ సమస్యను తెలపాలి. మీ దగ్గర ఉన్న యుటిఆర్ సంఖ్యతో పాటు లావాదేవీ వివరాలను కూడా వాళ్లకు అందించాలి. బ్యాంకు గ్రహీత వీలైతే చెల్లింపును రిటర్న్స్ కోసం బ్యాంకుకు సంప్రదించవచ్చు.