Todays Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు…తులం ఎంత అంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. అయితే ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన కారణంగా బంగారం ధరలో కూడా తగ్గుదల కనిపిస్తుంది. కొన్ని రోజుల నుంచి బంగారం మరియు వెండి ధరలలో హెచ్చుతగ్గులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్న ఆ మధ్య బంగారం ధర ఆల్ టైం రికార్డ్ లక్ష రూపాయలకు చేరింది. ప్రస్తుతం గోల్డ్ రేటు తగ్గుతూ ఉంది.

మే 19 సోమవారం రోజున బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు బంగారం మరియు వెండి ధరలలో పెద్దగా మార్పులు జరగలేదు. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములు రూ. 87,190, అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములు రూ. 95,120 గా ఉంది. ఈరోజు కిలో వెండి రూ. 96,900 దగ్గర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర ఈరోజు రూ. 87,190, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రు. 95,120. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,340, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,270.

ఇక ముంబై నగరంలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,190, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,120 గా ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలలో పెరుగుదల అలాగే తగ్గుదల కూడా కనిపించింది. అయితే ఈరోజు మాత్రం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీనికి ఒక కారణం అమెరికా మరియు చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం కూడా.

పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంలో శాంతి నెల 19 అని అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ముగిసిన వార్త వంటివి కూడా బంగారం డిమాండ్ ను ప్రభావితం చేస్తున్నాయి అని నిపుణులు చెప్తున్నారు. అలాగే అంతర్జాతీయంగా డాలర్ ధర మరియు స్టాక్ మార్కెట్ పెరుగుదల కూడా మార్కెట్లో బంగారం మెరుపును తగ్గించాయి అని చెప్పడంలో సందేహం లేదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now