Indiramma Houses: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భంగం ఎదురయ్యింది. ప్రభుత్వము అర్హులైన (Eligible) వారిని కాదని నేతలు అనుచరులకు ఈ ఇళ్లను మంజూరు చేయడంతో కేంద్ర ప్రభుత్వ పీఎం ఏవై (PMAY) ఆప్ లో తిరస్కారానికి గురవుతున్నారు. ఇప్పటివరకు మంజూరైన ఇళ్లలో 20వేల ఇల్లు రద్దు అయ్యాయి. ఇండ్ల నిర్మాణం పెద్ద సంఖ్యలో మొదలైన తర్వాత ఈ విధంగా రద్దు కావడంతో అందరికీ ఆందోళన మొదలైంది. ఇల్లు మంజూరు అయిన వాళ్లు కూడా తమ ఇల్లు ఏ సమయంలో రద్దు అవుతుందో అని ఆందోళన చెందుతున్నారు.
Also Read: ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లందరికీ పండగే..
తెలంగాణ రాష్ట్ర (Telangana State) ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లను అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా లబ్ధిదారుల (Beneficiaries) ఎంపికలో పొరపాట్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం 360 డిగ్రీల చెకింగ్ తో కూడిన ఒక యాప్ ను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించింది. ఈ యాప్ లో లబ్ధిదారుల ఆధార్ నెంబర్ను (Aadhar Number) నమోదు చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఏవై నిబంధనలలో ముఖ్యంగా పేద కుటుంబాలు, వితంతువులు, ఎస్ఎస్సి మరియు ఎస్టీ వారికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా నిర్ణయం (The Decision) తీసుకున్నారు.
Also Read: ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు పండగ లాంటి వార్త.. ఇకపై తక్కువ ధరకే
ముఖ్యంగా ఈ నిబంధనలలో ప్రభుత్వం నుంచి గత 20 ఇల్లు పొందని వారు అయ్యి ఉండాలి. ఈ యాప్ లో కుటుంబా ఆదాయం అలాగే ఆస్తుల వివరాలు కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఫైనాన్స్లో విలాస వస్తువులను, వాహనాలను కొనుగోలు చేసిన కూడా ఈ యాప్ లో తెలిసిపోతుంది. ఎవరైనా ఖరీదైన కార్లు, టీవీలు వంటివి కొనుగోలు చేసేవారు అదే ఇంట్లో ఉంటున్నప్పటికీ వీరి దరఖాస్తు (Application Cancel) కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఈ ఆప్ ద్వారా వారి కుటుంబ జీవన ప్రమాణాలను అంచనా వేసి వాళ్లకు ఇల్లు మంజూరు చేయాలో లేదో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ యాప్ లో మనుషుల ప్రమేయం లేకుండా సాఫ్ట్వేర్ (Software) ద్వారా మొత్తం ప్రాసెస్ జరుగుతుంది.