Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలిపింది. ఇళ్ల నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారులపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిమెంట్ మరియు స్టీల్ కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇల్లు నిర్మించాలన్నది ప్రభుత్వం ముఖ్య లక్ష్యంగా తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం లక్షలాది మంది పేదలకు శాశ్వత నివాసం కల్పించాలని ముఖ్య సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ క్రమంలో పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో సిమెంట్ మరియు స్టీల్ కంపెనీలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు దిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
ఈ ఇల్లు అన్ని పూర్తి అవ్వడానికి 40.50 లక్షల టన్నుల సిమెంట్ అలాగే 68 లక్షల టన్నుల స్టీల్ అవసరం అవుతుందని ఇప్పటికే అధికార వర్గాలు అంచనా వేశాయి. మన దేశవ్యాప్తంగా జరిగే భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ నిర్మాణ సామాగ్రి ధరలు మార్కెట్లో గణనీయంగా పెరిగి లబ్ధిదారులపై ఆర్థిక భారం పెంచుతున్నాయి. అయితే ఈ ఇళ్లను పూర్తి చేయడానికి భారీగా నిర్మాణ సామాగ్రి అవసరమవుతున్న క్రమంలో ప్రభుత్వం ఈ సామాగ్రిని తక్కువ ధరకే అందించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సిమెంట్ బస్తా ధరపై ఈ మధ్యకాలంలో 50 రూపాయల నుంచి 80 రూపాయల మేర పెరిగింది. టెన్ స్టీల్ ధర కూడా 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పెరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక్కో ఇంటిపై అదనంగా ఆర్థిక భారం రూ.15000 నుంచి రూ.17వేల వరకు పడుతుంది.