Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లందరికీ పండగే..

Indiramma illu
Indiramma illu

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లందరికీ పండగే..

 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాదులో ఇప్పటికే 16 ముడిచివాడలలో జి ప్లస్ త్రీ నమూనాలో ఇళ్ల నిర్మాణం మొదలయ్యింది. 84 వేల ఇళ్లను నిర్మించడం ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తుంది. పేదలకు ఇళ్లను నిర్మించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి అడుగు కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలతో అద్దం పట్టేలా ఉంది.

రేవంత్ రెడ్డి సర్కార్ బిపిఎల్ వర్గాల ప్రజలకు కనీస అవసరమైన నివాస హక్కును కల్పించాలని అలాగే అట్టడుగు తరగతుల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించే ముఖ్య ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే ఇందిరమ్మ పథకం విజయవంతంగా అమలు అవుతుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలలో కూడా పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది.

ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో ఉన్న స్థల భావాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకేసారి ఎక్కువమందికి నివాస సౌకర్యం కల్పించే ఉద్దేశంతో జీప్రెస్టింగ్ నమూనాలో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబోతుంది. అంటే ప్రభుత్వం నాలుగు అంతస్తులు కలిగిన అపార్ట్మెంట్ నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థలాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. కొన్ని ప్రాంతాలలో ఈ ప్రక్రియ పూర్తి కూడా అయ్యింది. గ్రేటర్ హైదరాబాదులో ఉన్న 16 ప్రధాన మురికివాడాలో భూములను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఐఏఎస్ సదన్ పరిధిలో ఉన్న సరళ దేవినగర్ మరియు దిల్సుఖ్నగర్లోని కొన్ని పిల్లిగుడిసే ప్రాంతాలు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటివరకు ఈ ప్రాంతాలలో ఎటువంటి భూవివాదాలు లేని కారణంగా అక్కడ త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now