POST OFFICE: ఇప్పుడున్న రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే కొన్ని రకాల పథకాలలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా లేదా నెలనెలా కొంత పెట్టుబడి చేయడం ద్వారా కూడా ప్రతి నెల మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అయితే మీకు ప్రతినెల 20వేల రూపాయల రాబడి కావాలంటే మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఈ స్కీమ్లో చేరవచ్చు. ప్రస్తుతం చాలామంది ప్రతినెలా కొంత ఆదాయం వచ్చేలాగా పెట్టుబడులు చేస్తున్నారు. ఇలా కొన్ని రకాల పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతినెలా మంచి ఆదాయం పొందవచ్చు. ఇటువంటి పథకాలు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయి.
పదవి విరమణ తర్వాత ప్రతినెల స్థిర ఆదాయం అందించే పథకం కోసం మీరు కనుక చూస్తున్నట్లయితే ఈ పథకం మీకు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఉండే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం లో ప్రతి నెల 20,500 పెన్షన్ లభిస్తుంది. ముఖ్యంగా ఇది సీనియర్ సిటిజెన్ల కోసం రూపొందించారు. ఎందుకంటే వాళ్లు పదవి విరమణ తర్వాత కూడా డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. పదవి విరమణ తర్వాత మీకు ప్రతినెల స్థిర ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు మిమ్మల్ని రిస్క్ నుండి రక్షించే పథకం కోసం ఆరా తీస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం మీకు చాలా బెస్ట్ పథకం.
కానీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టేముందు నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇందులో గరిష్టంగా 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ప్రతి ఏడాది రూ.2 లక్షల 46 వేల వడ్డీ వస్తుంది. అంటే మీకు ప్రతి నెల రూ.20,500 మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. పోస్ట్ ఆఫీస్ లో ఉండే ఈ పథకం 8.2% గా వడ్డీ రేటు అందజేస్తున్నారు.