Todays Horoscope: ఈ 3 అదృష్ట రాశులు ఇవే.. నేడు 12 రాశుల దిన ఫలాలు..
ఈరోజు ఏప్రిల్ 12, 2025 మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా లభిస్తుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికపరంగా చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇవే.
మేష రాశి:
ఉద్యోగంలో ప్రాధాన్యం లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారం బిజీగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక రకాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చులు చేయకూడదు. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. డబ్బును నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
వృషభ రాశి:
ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
మిథున రాశి:
ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు మరియు స్పెక్యులేషన్ వంటి వాటి వలన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మీ మాటకు విలువ ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి మరియు వ్యాపారం యాక్టివిటీగా సాగుతాయి. వ్యాపారంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. అనుకున్న పనులన్నీ వేగంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
సింహరాశి:
ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన లాభాలను పొందుతారు. ఆదాయం పెరిగి ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఇది అనుకూల సమయం. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
కన్యరాశి:
వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి మరియు ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో అధిక లాభాలు అందుకుంటారు. అనేక ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. షేర్లు మరియు స్పెక్యులేషన్ల వలన చాలా లాభాలు పొందుతారు. బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పరిచయం ఉన్నవాళ్లలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
తులారాశి:
ముఖ్యమైన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. బంధువులనుంచి శుభవార్తలు వినే అవకాశముంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి మరియు ఉద్యోగంలో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. శుభవార్తలను వింటారు. వ్యాపారంలో మీ ఆలోచనల వల్ల లాభాలను పొందుతారు. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి:
వృత్తి మరియు ఉద్యోగం నల్లేరు మీద బండిలా ముందుకు సాగుతాయి. మీరు ఆశించిన స్థాయిలో వ్యాపారంలో రాబడి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ వేగంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి:
ఏ పని చేసిన విజయం సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా ఫలితాలను ఇస్తాయి. వృత్తి మరియు వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఆస్తి వివాదంలో శుభవార్త వింటారు.
మకర రాశి:
ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులు ఆర్థిక సహాయం కోసం మీ మీద ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి మరియు వ్యాపారం సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభరాశి:
ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో ఆశాజనకంగా సాగుతాయి. ముఖ్యమైన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఎప్పటినుంచ ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మీనరాశి:
ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. ఆర్థిక లావాదేవీలు చేయడం వలన లాభాలు పొందుతారు. పట్టుదలతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో శ్రమ మరియు ఒత్తిడి తప్పవు. వృత్తి మరియు వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతాయి.