KTR: లింగంపేట్, జూలై 25 (ప్రజా శంఖారావం): కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తంతో అమాయక ప్రజలను మోసం చేసి గద్దనెక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఆత్మ గర్జన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేటీఆర్ (KTR) మాట్లాడారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్ మాజీ ఎమ్మల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ ఒక్క మోసం కాదు అనేక మోసాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ (Congress) ఆగడాలకు అడ్డుకట్ట వేసి వారి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
Also Read: రాజకీయ ఎదుగుదల ఓర్వలేకనే అక్రమ అరెస్టు
రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఊళ్లో సర్పంచ్ బిఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులకు పట్టం కట్టాలని ప్రజలను కేటీఆర్ కోరారు. స్థానిక సంస్థ (Local Body Elections) ఎన్నికల్లో గెలిచేది బిఆర్ఎస్ సర్పంచ్ లే అని ముక్తకంఠంతో అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించుకొని, కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. ముందస్తుగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ లింగంపేట ఆత్మ గర్జన (To the Gathering of the Soul) సభకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ వర్షం పడడంతో కొన్ని ఇక్కట్లు తప్పలేదు. వర్షన్ని సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నరు. ఇకనైనా చెప్పుడు మాటలు వినకుండా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కేటీఆర్ హితోపదేశం చేశారు.
Also Read: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే బిఆర్ఎస్ నేత సాయిలును గత కొన్ని రోజుల కిందట అర్ధ నగ్నంగా పోలీస్ స్టేషన్ (Police Station)కు తీసుకెళ్లగా అదే చోట కేటీఆర్ సమక్షంలో శాలువాతో సత్కరించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే పోలీసులు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు వినుకుంటూ వారి విధులు కూడా బాధ్యతాయుతంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కామారెడ్డి మాజీ జిల్లా జడ్పీ చైర్ పర్సన్, పట్టణ కామారెడ్డి బిఆర్ఎస్ అధ్యక్షులు ముజుబుద్దిన్, బిఆర్ఎస్ నేతలు, నాయకులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు వివిధ చుట్టుపక్కల నుండి హాజరయ్యారు.