KTR sensational comments: నవంబర్ 07, ప్రజా శంఖారావం వెబ్ డిస్క్: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, తనను జైల్లో పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే తాను రెడీగా ఉన్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక 2, 3 నెలలు జైల్లో ఉంటే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. జైల్లో హ్యాపీగా ఉంటానని, ప్రశాంతంగా యోగా చేసుకుంటూ మళ్లీ బయటకు తిరిగి వచ్చిన తర్వాత పాదయాత్ర మొదలుపెడతానన్నారు. తనను టార్గెట్ చేయడం కాదని, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన హితవుపలికారు. సీఎం రేవంత్ రెడ్డి ఉడత ఊపులకు ఎవరు భయపడే వారు లేరని, తనకు ఎలాంటి ఏసీబీ నోటీసులు అందలేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని స్కెచ్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ వేదికగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మూలాఖత్ అయ్యాయని ఆయన ఆరోపించారు.
KTR sensational comments: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now