Vastu Tips: ఇంట్లో ఉండే పూజగది ఆ ఇంట్లో వాతావరణాన్ని అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజు కొంతమంది ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎన్నో రకాల గొడవలు జరిగి ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అయితే ఈ విషయం గురించి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. పూజ గదిలో అవసరంలేని కొన్ని వస్తువులను పెట్టడం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. వాస్తు శాస్త్రంలో ఇంటికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇల్లు లేదా ఆఫీసులను వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకోవడం వలన ఆ ఇంట్లో మనశ్శాంతి అలాగే కుటుంబ సభ్యుల మధ్య మంచి బంధం ఉంటుంది.
వాస్తు సరిగా ఉంటే ఆ ఇంట్లో సంతోషకరమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వాస్తు నియమాలు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కుటుంబ సభ్యులు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అయితే పూజ గదిలో పొరపాటున కూడా ఈ వస్తువును పెట్టకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ వస్తువు పూజ గదిలో పెట్టినట్లయితే పేదరికాన్ని తెచ్చిపెడుతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా పెరుగుతాయి అని చెప్తున్నారు. ఇంట్లో పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏ వస్తువులను పూజ గదిలో పెడితే గొడవలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఇంట్లో ఉండే పవిత్రమైన స్థలం పూజ గది. కేవలం పూజగది దైవారాధన కోసం మాత్రమే కాదు ఇంట్లో సానుకూల శక్తి పెరగడానికి కేంద్ర బిందువుగా కూడా ఇది పనిచేస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపుల్లలు పెట్టినట్లయితే అది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. అగ్గిపుల్లలను పూజ గదిలో పెట్టడం వలన ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అగ్గిపుల్లలు శక్తిని విధ్వంసం చేస్తాయి. అందువలన వీటిని పూజ గదిలో పెడితే శక్తిలో అసమతుల్యత సంభవించి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు జరుగుతాయి.