Home ఆధ్యాత్మికం Chanakya Neeti: దానం చేసే వారు ఈ పద్దతులను పాటించాలి.. లేదంటే అప్పులపాలవడం ఖాయం.. ఆచార్య...

Chanakya Neeti: దానం చేసే వారు ఈ పద్దతులను పాటించాలి.. లేదంటే అప్పులపాలవడం ఖాయం.. ఆచార్య చాణక్య

Chanakya neeti
Chanakya neeti

Chanakya Neeti: దానం చేసే వారు ఈ పద్దతులను పాటించాలి.. లేదంటే అప్పులపాలవడం ఖాయం.. ఆచార్య చాణక్య

ఆచార్య చాణక్యుడు అర్థ శాస్త్రవేత్త, అధ్యాపకుడు, రాజనీతజ్ఞుడు, అంతే కాదు గొప్ప మేధావి కూడా. ఆయన నీతి శాస్త్రంలో జీవన విధానం గురించి చెప్పిన మంచి మాటలు నేటికీ ప్రజల్లో ఉన్నవి. దానం చేయడం మంచి ఆలోచన అంటారు. కానీ ఎవరికీ దానం చేయాలి అనే విషయాన్ని కూడా చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టంగా చెప్పాడు.

కొందరు గొప్పల కోసం దానం చేస్తారు. కానీ వాళ్ళ వద్ద ఆదాయం నిల్వ ఎంత ఉన్నదని వెనక్కి తిరిగి చూడరు. ఆలా ఆదాయం లేకున్నా దానం చేసేవారు అప్పులపాలవుతారు. కాబట్టి ఉన్నంతలోనే సర్దుకోవాలి. ఉంటెనే దానం చేయాలి. అప్పులతో దానం చేయడం వలన ఎలాంటి ఫలితం ఉండదు. భావోద్వేగాలకు లోనై కొందరు వ్యక్తులు దానం చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. దానం చేయడంలో తొందరపాటు అసలే పనికి రాదు. ఇలాంటి వారు అప్పులపాలై భార్య, పిల్లలను వీదిపాలు చేస్తారు. దానం చేసేముందు మన చేతిలో ఎంత ఉంది అనేది ముందుగా చూసుకోవాలి.

అందులో ఎంత దానం చేయాలి. మన అవసరాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు ముందుగా ఆలోచించుకున్న తరువాతనే దానం చేయదానికి ముందుకు వెళ్ళాలి. మనం ఎవరికయితే దానం చేస్తామో వారికి మనం గుర్తుఉండాలి. చేసిన దానం మరచి పోయేవారికి దానం చేయరాదు. విశ్వాసం లేని వారికి దానం చేస్తే ఎలాంటి ఫలితం కూడా ఉండదు. డబ్బు, కుటుంబం భాద్యత లేని వారికి దానం చేయరాదు. అటువంటి వారికి దానం చేసిన నేపథ్యంలో ఎలాంటి ఫలితం కూడ దక్కదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now