Metpally: మెట్ పల్లి/రాయికల్, జూలై27 (ప్రజా శంఖారావం): మానవత్వం ఉన్న దాతలు ముందుకొచ్చి తమ తండ్రి అంతక్రియల కోసం ఆర్థిక సాయం అందించాలంటూ కూతుళ్లు ఇద్దరు కన్నీటితో వేడుకుంటున్న ఘటన. రాయికల్ (Rayikal Town) పట్టణంలో రోడ్డు పక్కనే ఒక గుడిసెలో సీస కమ్మరి వృత్తి చేస్తూ నరాల జాంగిర్ కుటుంబం జీవనం సాగిస్తుంది. భార్య ఆరోగ్య (Health) పరిస్థితి బాగోలేక ఉన్న ఇద్దరు కూతుర్ల పెళ్లిలు చేయలేక కూలి పని చేస్తూ జీవిస్తున్న జాంగిర్ హఠాన్మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
Also Read:అక్రమకట్టడాలు @ ఆర్మూర్
ఈ మధ్యకాలంలోనే జాంగిర్ కొడుకు చనిపోయాడు, ఇప్పుడు కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా తయారైంది. దీంతో తండ్రి అంత్యక్రియల (Funeral) కోసం ఉన్న ఇద్దరు కూతుళ్లు దాతల ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడంతో ఎవరిని సాయం అడగాలో అర్థం కాక తండ్రి మృతదేహం ముందు కూతుర్లు దిక్కుతోచని స్థితిలో ఏడ్చుకుంటూ దాతల ఆర్థిక సాయం (Finacial Help) కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మానవీయ ఘటన అక్కడివారిని కలచివేస్తుంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని మృతుని కూతుళ్ళు వేడుకుంటున్నారు.
Also Read:పెదవి దాటిన ప్రగల్బాలు.. పారిశుద్ధ్యం దరికి చేరని పార, గమేళా..!