Muncipal: నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..!

Muncipal
Muncipal

** కష్టం ఒకరిది.. ఫలితం మరొకరిది..
* ఆధారాలు లేకపోవడంతో అడ్డగోలు జీతాల బిల్లులు..?
** నియామకాల్లో చేతులు మారుతున్న నజరాణాలు..!
* ఒకరి పేరుతో మరొకరికి జీతాల చెల్లింపులు..?
* వాచ్ అండ్ వార్డ్ నియమకల్లో అదే తంతు..!

Muncipal: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూలై 07 (ప్రజా శంఖారావం): ఆ కార్యాలయంలో ఆయనగారనుకుంటే కాని పని ఏదీ ఉండదు. ఎందుకంటే అక్కడ ఆయనే బాస్.. ఇంకేముంది ఆయనకు ఎదురు చెప్పే వారు లేకపోవడంతో ఆడిందల్లా ఆట.. పాడిందల్లా పాటగా.. కొనసాగుతుంది. ఈ తంతు ఎక్కడో అనుకుంటున్నారా..! మరెక్కడో కాదు..! నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (Armoor) పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో (Muncipal Office) ఆ అధికారి ఏది అనుకుంటే అది క్షణాల్లో జరుగుతుంది. వద్దనుకుంటే అలాగే పనులు నిలిచిపోతాయి. అసలు విషయానికొస్తే.. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే 96 మంది రెగ్యులర్ సిబ్బందితో పాటు 220 మంది ఔట్ సోర్స్ పద్ధతిలో పనిచేసే సిబ్బందితో పాటు ఫిట్టర్ సెక్షన్లో సుమారు 9 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు అనధికార లెక్కలు ఉన్నాయి. ఔట్ సోర్స్ సిబ్బందిని కార్యాలయ అవసరాల నిమిత్తం సానిటేషన్, వాటర్ సెక్షన్, జనన, మరణ ధ్రువీకరణలు, రెవెన్యూ ఇలా మొదలైన సెక్షన్లలో జీతభత్యాలు చెల్లిస్తూ నియమించారు.

గతంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలైన మామిడిపల్లి, పెర్కిట్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సఫాయి కార్మికులు కూడా కొంతమంది ఈ ఔట్సోర్సింగ్ లో సిబ్బందిగా పనిచేస్తున్నారు. గడిచిన రెండు సంవత్సరాల క్రితం మామిడిపల్లి గ్రామపంచాయతీలో సపాయి కార్మికునిగా పనిచేస్తున్న ఒకరు అనారోగ్య కారణాలతో (Death) చనిపోయారు. హ్యుమానిటీ గ్రౌండ్లో వారి ప్లేస్ లో మృతుని కుటుంబ సభ్యున్ని ఒకరిని నియమించాల్సి ఉండగా ఇప్పటివరకు ఔట్సోర్సింగ్ సెక్షన్లో నియామకం జరగలేదు. కానీ మరణించిన గ్రామపంచాయతీ సపాయి స్థానంలో మరొకరిని ఇదివరకే వాటర్ సెక్షన్ లో ఆరు నెలలుగా పని చేస్తున్న (ఔట్సోర్సింగ్ లో నియామకానికంటే ముందు పనిచేసిన) మరొకరిని నియమించడం (Appointing) జరిగింది. ఈ విషయంలో ఇది వరకే అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న అతని బంధువు ఉండడంతో ఆ అధికారితో సంప్రదింపులు జరగడానికి మార్గం సులభమైంది. ఈ నియామకంలో భారీగానే నజరాణాలు కూడా చేతులు మారినట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి.

కష్టం ఒకరిది.. ఫలితం మరొకరిది..

గడిచిన 30 సంవత్సరాలుగా మామిడిపల్లి గ్రామపంచాయతీలో సపాయి కార్మికునిగా, మరణించేంత వరకు పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేసిన ఫలితం లేకుండా పోయింది. చివరకి మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా హ్యుమానిటీ గ్రౌండ్ లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో మరణించిన వ్యక్తి ప్లేస్ లో తీసుకోవడానికి కూడా అధికారులకు మనసు రాలేదు. కానీ మరో వ్యక్తిని మాత్రం భారీ నజరానాల నడుమ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించడం విడ్డూరంగా ఉంది. దీంతో కష్టం ఒకరిది ఫలితం మరొకరిది అన్న చందంగా ఈ నియామకం జరిగిందని చెప్పవచ్చు.

ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే 15 ఫిబ్రవరి 2024 నాడు ఔట్సోర్సింగ్ పద్ధతిలో (ఇప్పుడు ఉన్న 220 మంది సిబ్బంది కాకుండా అదనంగా) నియామకాలు చేసుకోవడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అనుమతులు తీసుకోవాలని ఒక సర్కులర్ కూడా జారీ చేయడం జరిగింది. కానీ వాచ్ అండ్ వార్డ్ పద్ధతిలో వాటర్ సెక్షన్ లో పనిచేస్తున్న మరో వ్యక్తిని ఔట్సోర్సింగ్ లో 2025 సంవత్సరంలో ఆ అధికారి ఆయన అనధికార ఉత్తర్వుల మేరకు ఔట్సోర్సింగ్ లో నియమించి, శ్రీమన్నారాయణ వెల్ఫేర్ సొసైటీ గ్రూప్ ద్వారా ప్రతినెల ₹ 15600/- జీతం చెల్లిస్తున్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి. అంటే ఎంఏ & యుడి అధికారుల ఆదేశాలను కూడా ఆ అధికారి బేఖాతర్ చేసినట్లుగా స్పష్టమవుతుంది.

Also Read: మున్సిపల్ కమిషనర్ సస్పెండ్

వాచ్ అండ్ వార్డ్ నియమకల్లో అదే తంతు..!

మున్సిపల్ కార్యాలయంలో వాచ్ అండ్ వార్డ్ నియామకాల్లో అనధికారిక లెక్కల ప్రకారం 25 మంది సిబ్బంది పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెక్షన్ లో కూడా అడ్డగోలుగా (Diagonally) నియామకాలు చేపడుతూ అందిన కాడికి కొంతమంది రెగ్యులర్ సిబ్బందితో అధికారులు తమకు నచ్చిన వారికి జీతాలు చెల్లిస్తున్నట్లుగా సమాచారం. పనిచేసే వారికి ప్రతినెల 12 వేల రూపాయలను చెల్లిస్తారు. ఈ చెల్లింపులు డైలీ వారి పద్ధతిన సిబ్బంది పని చేస్తున్న రోజులను లెక్కపెట్టి, ప్రతినెల ఒక్క రోజుకు 400 రూపాయల చొప్పున 30 రోజుల పని దినాలకు చేసిన పని దినాల డబ్బులను లెక్కించి జీతాలు చెల్లిస్తారని తెలుస్తోంది. ఈ పద్ధతిలో కొంతమంది కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తే మరి కొంతమంది ఎలాంటి పని లేకుండానే, పనిచేస్తున్నట్లుగా తప్పుడు అటెండెన్స్ తో కొంతమందికి, మరి కొంతమంది చేయకపోయినా పనిచేస్తున్నట్లుగా అటెండెన్స్ చూపిస్తూ అధికారులు (Officer) తమకు నచ్చిన వారికి తమ వద్ద పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లిస్తున్నట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి.

ఇదే అదునుగా భావించిన మరి కొంతమంది రెగ్యులర్ సిబ్బంది తమ సొంత మనుషులను కూడా వాచ్ అండ్ వార్డ్ పద్ధతిలో పనిచేస్తున్నట్లుగా చూపించి ప్రతినెల 12 వేల రూపాయల చొప్పున జీతాలు తీసుకుంటున్నట్లుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ పద్ధతిలో పని చేసే వారికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న రెగ్యులర్ సిబ్బంది చూపించే అటెండెన్స్ మినహా, వాచ్ అండ్ వర్డ్ లో సిబ్బంది పనిచేసిన, చేయకపోయినా, అసలు ఎవరు పని చేస్తున్నారో ఖచ్చితమైన పేర్లు లేకపోయినా, విరే ఖచ్చితంగా చేస్తున్నారనే ఆధారాలు లేకపోవడంతో వాచ్ అండ్ వార్డ్ నియమకల్లో కూడా సిబ్బందికి చెల్లించే జీతభత్యాలలో తప్పులు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా లేకపోలేదు. మరి మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నిబంధనలకు విరుద్ధంగా నియమకాలు, జీతభత్యాల చెల్లింపులో అడ్డగోలు లెక్కలపై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ (District Collector) స్పందించి విజిలెన్స్ (Vigilance) విచారణ జరిపితే తప్ప నిజాలు బయటకు రావని కొంతమంది సిబ్బంది వాపోతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now