Municipal Commissioner: బోధన్, ఆగస్టు 06 (ప్రజా శంఖారావం): మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner)గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ కృష్ణ (Jadav Krishna)ను ఉన్నతాధికారులు సస్పెన్షన్ (Suspension) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బోధన్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ కృష్ణ గతంలో విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు వేటు వేసినట్లు తెలుస్తుంది.
Also Read: అక్రమకట్టడాలు @ ఆర్మూర్
గతంలో ఆయన ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో ఏ అవకతవలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. అక్రమ ఇంటి నెంబర్లను (house Numbers) కేటాయించినట్లు ఆయనపై ఫిర్యాదులు (Complaint) రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో గతంలో ఆయన ఆర్ఐ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
Also Read: పదవి విరమణ కంటే ముందే ఏసీబీకి చిక్కిన డిటిఓ
అదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ప్రభుత్వ భూములకు ఇంటి నెంబర్లు ఇవ్వడం, లేని ఇంటికి ఉన్నట్లుగా ఇంటి నెంబర్లు కేటాయించడం మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్లను కేటాయించడం వంటి పలు ఆరోపణలు ఆయనపై వచ్చాయి. విచారణ (Enquiry)చేపట్టిన ఉన్నతాధికారులు ప్రస్తుతం బోధన్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనపై సస్పెన్షన్ వేటువేశారు.