One died under suspicious circumstances: అనుమానస్పద స్థితిలో ఒకరి మృతి

Suspicious death
Suspicious death

One died under suspicious circumstances: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 14 (ప్రజా శంఖారావం): పట్టణ కేంద్రంలో ఒకరు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని రాజారాం నగర్ లో నివాసం ఉంటున్న బోట్ల నరేష్ (40) ఆదివారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. మృతుడు గత నాలుగు నెలల క్రితం దుబాయ్ నుండి స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఒక రైస్ మిల్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని కుటుంబ సభ్యులు చెప్పారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now