Clash of swords in procession: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 14 (ప్రజా శంఖారావం): తెల్లవారుజామున జరిగిన కత్తిపోట్ల ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి విద్యానగర్ కాలనీలోని దుర్గామాత మండపం వద్ద జరిగిన కత్తిపోట్లలో వరుణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో జరుగుతున్న ఉత్సవ ఊరేగింపులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది.
ఒక అమ్మాయి విషయంలో జరిగిన గొడవలో ఇరువురు యువకులు గొడవ పడ్డట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయితో ఇదివరకే నిశ్చితార్థమైన అబ్బాయి వరుణ్ అనే మరో యువకునిపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఒకరికి కత్తిపోట్లు జరగా పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కత్తిపోట్లకు గురైన యువకుడు ఒక మెకానిక్ షెడ్ లో మెకానిక్ గా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.