Raitu Barosa: రైతులకు రైతు భరోసా పథకం కింద జూన్ మూడో వారం నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక ఎకరానికి రెండు విడతలగా రూ.6000 చొప్పున కాకుండా ఒకే విడతలో రూ.12,000 అకౌంట్లో జమ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక సవాలుగా మారింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేల చొప్పున పంట నష్టం జరిగిన 41 వేల మంది రైతులకు రూ.51 కోట్లకు పైగా ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించింది.
తాజాగా రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. జూన్ నెల మూడవ వారంలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒకే విడతలో నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక ఎకరానికి రెండు విడతలలో 6000 రూపాయలు చొప్పున కాకుండా ఒకేసారి ఒక ఎకరానికి 12 వేలు జమ చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే జరిగితే రైతులకు చాలా ఉపశమనం కలుగుతుంది.రైతులందరికీ పంట పెట్టుబడికి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
కానీ ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇది పరిశీలన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న కారణంగా రైతు భరోసా పథకం కింద ఇంతకుముందు విడుదల చేసిన నిధులు కూడా ఇప్పటికీ ఇంకా చాలామంది రైతులకు అందలేదు. ప్రభుత్వం నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం 4 వేల కోట్లకు పైగా నిధులను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 4 ఎకరాలకు పైన ఉన్న రైతులకు త్వరలోనే ఆర్థిక సాయం విడుదల చేస్తామని స్పష్టంగా తెలిపారు.