Investment Plan: చాలామంది సంపాదించిన డబ్బులు కొంచెం కొంచెం కూడా పెట్టి వాటిని మంచి పెట్టుబడి పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఏ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తే భారీ మొత్తంలో రాబడి పొందవచ్చు చాలామందికి అవగాహన ఉండదు. ఈ క్రమంలో వాళ్లు పెట్టుబడిని వాయిదా వేస్తూ వస్తారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కేవలం నెలకు 100 రూపాయలను సిప్ చేయడం ద్వారా కూడా భవిష్యత్తులో కోటి రూపాయలు పొందవచ్చు. కాంపౌండింగ్ పవర్ ఇది సాధ్యమయ్యేలాగా చేస్తుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మీరు చిన్న మొత్తంలో పెట్టుబడి చేసి భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఆర్థికంగా ఎదగాలని మనలో చాలామందికి కోరిక ఉంటుంది.
ఆ కోరికను నెరవేర్చుకోవడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. సరైన ఆర్థిక క్రమశిక్షణను పాటించడం వలన చిన్న మొత్తంలో పెట్టుబడి ప్రారంభించి దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధి ఏర్పరచుకోవచ్చు. మీరు 48 సంవత్సరాల పాటు కేవలం ప్రతినెల 100 రూపాయలు చొప్పున సిప్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఒక కోటి రూపాయల నిధిని ఏర్పరచుకోవచ్చు. గడిచిన 40 సంవత్సరాల నుంచి భారత్ ఈక్విటీ మార్కెట్లో 15% వార్షిక రాబడిని అందిస్తున్నాయి.
ఇదే కనుక భవిష్యత్తులో కూడా కొనసాగితే మీరు అనుకున్న లక్ష్యం చేరుకోవడం చాలా సులభం. భారత ఆర్థిక అభివృద్ధిని అంచనా వేస్తే రాబోయే దశాబ్దాలలో కూడా మీరు ఇటువంటి రాబడులను ఆశించవచ్చు అని తెలుస్తుంది. ఈ మొత్తం వెనుక ఉన్న అసలు రహస్యం కాంపౌండెంట్ పవర్. అంటే వడ్డీ మీద వడ్డీ అన్నమాట. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం పై వడ్డీ లెక్కించబడుతుంది. ఆ వడ్డీ తర్వాతి ఏడాదికి అసలుకు కలపబడి దానిమీద కూడా వడ్డీ లెక్కించబడుతుంది. ఈ విధంగా మీరు చాలా ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగించినట్లయితే మీరు అనుకున్న లక్ష్యం వేగంగా పూర్తి అవుతుంది.