CREDIT SCORE: ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయ్యి.. క్రెడిట్ స్కోర్ ను పెంచుకోండి

CREDIT SCORE
CREDIT SCORE

CREDIT SCORE: బ్యాంకుల నుంచి రుణం పొందాలంటే క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యమైనది. వెహికల్ లోన్లు, పర్సనల్ లోన్లు, హోమ్ లోన్ ఏ లోన్ పొందాలన్నా కూడా బ్యాంక్ అధికారులు ముఖ్యంగా మీకు క్రెడిట్ కార్డ్ స్కోర్ ను పరిశీలిస్తారు. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారి లోను దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. లేకపోతే కొన్ని సందర్భాలలో అధిక వడ్డీ రేట్లు ఉన్న లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి క్రెడిట్ స్కోర్ తగినంత ఉండటం చాలా ముఖ్యం. అయితే ఈ స్కోర్ తక్కువగా ఉందని మీరు ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. మీకు క్రెడిట్ కార్డ్ స్కోర్ ను తగ్గిన క్రమశిక్షణతో ప్రణాళికలతో మెరుగుపరుచుకోవచ్చు.

మీరు తీసుకున్న రుణం బకాయిలను సకాలంలో చెల్లించినట్లయితే మీకు క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. ఈ ఎం ఐ లు, క్రెడిట్ కార్డు బిల్లులను ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలి. ఒక వాయిదా మిస్ అయినా కూడా అది మీకు క్రెడిట్ కార్డు స్కోర్ పై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు ఉన్న క్రెడిట్ కార్డ్ లిమిట్ లో 30% కంటే తక్కువగా వినియోగించుకోవడం చాలా బెటర్. ఉదాహరణకు చెప్పాలంటే మీకు క్రెడిట్ కార్డు పరిమితి లక్ష రూపాయలు ఉన్నట్లయితే దానిలో మీరు 30 వేల కంటే ఎక్కువగా ఉపయోగించకుండా జాగ్రత్తపడాలి.

అలాగే పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయకూడదు. క్రెడిట్ హిస్టరీ చాలా ముఖ్యం. చాలా కాలం నుంచి ఉన్న పాత క్రెడిట్ కార్డులు మీరు సకాలంలో చెల్లించినవి క్రెడిట్ స్కోర్ అనుకూలంగా ఉందని చెప్పడానికి దోహదపడతాయి. తరచూ కార్డుల కోసం అలాగే లోన్ల కోసం అప్లై చేయకూడదు. మీరు తరచూ లోన్ కోసం అప్లై చేస్తే బ్యాంకు మీకు సంబంధించిన క్రెడిట్ హార్డ్ ఎంక్వయిరీ నిర్వహిస్తుంది. ఇటువంటివి ఎక్కువ అయినా సందర్భంలో అవి మీ క్రెడిట్ స్కోర్ పై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now