Police case Registered: 7 నెలల పసికందు అమ్మకం, కేసు నమోదు

Baby selling police case
Baby selling police case

Police case Registered: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 05 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ లో 7 నెలల పసికందు అమ్మకంపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే నందిపేట్ మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన అంగేటి లక్ష్మీ పోశేట్టి దంపతులు వారికి పుట్టిన 7 నెలల బాబును వారం రోజుల క్రితం 30 వేల రూపాయలకు పేర్కిట్ కు చెందిన మహమ్మద్ గౌస్, షేక్ హబీబిలకు అమ్మినట్లు సమాచారం.

రషీద, మహమ్మద్ లకు పిల్లలు లేకపోవడంతో వారికోసం విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసిందని ఎస్సై గంగాధర్ వివరించారు. పోలీసులకు సమాచారం రావడంతో ఏఎస్ఐ లక్ష్మణ్ ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేసి, ఆయన ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం పసికందును నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న బాలల కేంద్రంలో ఐసిడిఎస్ అధికారుల సంరక్షణలో అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now