Negligence of Doctors: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 05 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భస్థ శిశువు మృతి చెందడం పై కుటుంబ సభ్యులు గైనకాలజిస్ట్ వైద్యురాలు గీతతో వాగ్వివదానికి దిగారు. శనివారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రూప్ల తండాకు చెందిన బాధావత్ మంజుల రెండవ కాన్పు కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించింది.
ఈ నెల 3న ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వైద్యులను సంప్రదించగా పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో మహిళ స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళింది. గర్భిణిని పరీక్షించిన వైద్యురాలు స్కానింగ్ రిపోర్ట్ లో గర్భంలోని పిండం మృతి చెందినట్లుగా పేర్కొంది. సదరు గర్భిణి స్కానింగ్ రిపోర్టులను తీసుకొని ఆర్మూరు ఏరియా ఆసుపత్రిలోని వైద్యురాలు గీతను సంప్రదించగా శిశు గుండె బలహీనంగా కొట్టుకుంటుందని వైద్యురాలు తెలిపినట్లు బాధితులు తెలిపారు.
కానీ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తిరిగి ఈనెల 5న వెళ్తే గర్భస్థ శిశువు మృతి చెందిందని డాక్టర్ తెలిపినట్లు వివరించారు. దీంతో గర్భిణీ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని వైద్యురాలితో వాగ్వివాదానికి దిగారు. 3 రోజుల క్రితమే గర్భస్థ శిశువు మృతి చెందినట్లు స్కానింగ్ రిపోర్ట్ లో ఉన్న వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భిణీకి తప్పుదోవ పట్టించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గర్భిణీకి శస్త్ర చికిత్స చేస్తామని కుటుంబ సభ్యులతో వైద్యురాలు సముదయించినట్లు సమాచారం.