Todays Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లో జరిగే హెచ్చుతగ్గులు మన దేశ మార్కెట్లో కూడా బంగారం ధరలపై మార్పులు చూపిస్తాయి. అమెరికా డాలర్ విలువ అలాగే రూపాయి మారక విలువ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంది.
రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతో సామాన్యులకు మళ్ళీ షాక్ ఇస్తున్నాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గితే మరొక రోజు భారీగా పెరుగుతూ బంగారం ధరలు మళ్ళీ లక్షకు చేరువలో ఉన్నాయి. నిన్న రూ.98,850 ఉన్న తులం బంగారం ధర ప్రస్తుతం లక్షకు చేరువలో ఉంది. జూన్ 4, 2025 బుధవారం రోజున స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.99,070 గా ఉంది. అలాగే కిలో వెండి 1, 00,200గా ఉంది.
దేశంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నగరాలలో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కేరళ వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.99,070, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,810 గా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ నగరాలలో ఈరోజు 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.99,070, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,810 గా ఉన్నాయి.