Chanakya Niti: కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండి విజయం సాధించవచ్చు అని ఆచార్య చానిక్యుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో విజయం సాధించాలని అనుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగాలని అనుకుంటారు. అయితే ఈ విధంగా సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడాలి అలాగే విజయం సాధించాలి అంటే ముందుగా వాళ్లకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. చాణుక్య నీతి సూత్రాలను చదివితే ఇది ఎలా సాధ్యమవుతుందో మీకు అర్థం అవుతుంది. ఆచార్య చాణిక్యుడు గొప్ప వ్యూహకర్త. అయినా మనుషులు గొప్పగా ఎలా జీవితాన్ని గడపాలో అనేక నియమాలు నీతి శాస్త్రంలో తెలిపారు. చాణిక్య నీతి శాస్త్రంలో ఆచార్య చాణక్యుడు తెలిపిన నియమాలను సలహాలను ఇప్పటికి కూడా చాలామంది పాటిస్తారు. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉంటేనే విజయం సాధించవచ్చు అని ఆచార్య చానిక్యుడు కొన్ని సూత్రాలు తెలిపరు.
తెలివైన మనుషులు చాలా తక్కువగా మాట్లాడి, ఎక్కువగా వినే స్వభావం కలిగి ఉంటారు. మౌనం అనేది మనిషికి ఉండే ఒక గొప్ప కళ. కొన్ని సందర్భాలలో మాట్లాడడం వలన కూడా నష్టం కలుగుతుంది అని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో మాట్లాడటం కంటే మౌనంగా ఉండడం చాలా మంచిది. ఒక మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే ముఖ్యంగా కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండాలి. ఏ ఇద్దరి మధ్య అయినా గొడవ జరుగుతుంటే ఆ గొడవతో మీకు సంబంధం లేకపోయినట్లయితే మీరు మధ్యలో జోక్యం చేసుకోకూడదు. ఇద్దరి మధ్యలో మీరు వేలు పెడితే మీకే సమస్యలు ఎదురవుతాయి. ఎదుటివారు తమ గొప్పతనం గురించి చెప్పుకుంటున్న సమయంలో మీరు మౌనం పాటించడం మంచిది.
ఒకవేళ వారి మాటలకు మీరు భంగం కలిగిస్తే మీరు వారి మాటలను ఖండించినట్లు అవుతుంది. మీరు వారి గొప్పతనానికి జలసీగా ఫీల్ అవుతున్నారు అని ఎదుటి వ్యక్తి అనుకుంటారు. ఒకవేళ ఎవరికైనా మీ మీద కోపం వచ్చినట్లయితే ఆ సమయంలో వారి కోపం మీరు మౌనంగా ఎదుర్కోవాలి. ఆ సమయంలో మౌనం పాటించాలి. ఈ విధంగా చేస్తే ఎదుటి వారి కోపం తగ్గుతుంది. ఏదైనా ఒక విషయం గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆ విషయం గురించి మీకు పూర్తిగా తెలియకపోతే దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. మీరు ఎంత చెప్పినా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తిని మీరు కలిసిన సమయంలో మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్లు మీ భావాలను పట్టించుకోరు. అటువంటి సమయంలో మౌనంగా ఉండాలి.