StarLink In India: త్వరలో మనదేశంలో స్టార్ లింక్ సేవలు.. ధర ఎంతో తెలుసా..
త్వరలో మనదేశంలో స్టార్ లింకు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో దీని ధర ఎంత ఉండవచ్చు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ మనదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే స్టార్ లింకుకు మన దేశ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ నుంచి అనుమతులు కూడా లభించాయి. ఆ మనదేశ ఎయిర్టెల్ కు చెందిన వన్ వెబ్ అలాగే రిలయన్స్ జియో వంటివి ఈ తరహా అనుమతులను అందుకోవడం జరిగింది.
అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనుమతులను అందుకున్న స్టాలిన్ సేవలకు సంబంధించి మన దేశంలో ధర ఎంత ఉండవచ్చు అనే దానిపై సామాజిక మాధ్యమాలలో చర్చలు జరుగుతున్నాయి. స్టాలిన్ ఇప్పటికే వందకు పైగా ఉన్న దేశాలలో శాటిలైట్ సేవలను అందిస్తుంది. ఇటీవల బంగ్లాదేశ్ లో కూడా స్టార్ లింక్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. దీనికోసం హార్డ్‌వేర్ ధర రూ.33000 గా నిర్ణయించారు. ఇక దీని నెలవారి ప్లాను ₹3,000 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ఈ ధరలే మనదేశంలో కూడా స్టార్లింపు పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు సిఎన్ బిసి 18 అనే కథనంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం మన దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలలో అలాగే చిన్న చిన్న పట్టణాలలో కూడా దాదాపు జియో, ఎయిర్టెల్ మరియు బిఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ కంపెనీలు టెలికాం బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ కంపెనీల మధ్య ఉన్న పోటీలు దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు ఉచిత ఇన్స్టాలేషన్ కూడా అందిస్తున్నాయి. అలాగే వాళ్ళు అపరిమిత డేటాను కేవలం 1000 రూపాయలకే 100 ఎంబిబిఎస్ తో అందిస్తున్నాయి. టీవీ మరియు ఓటీపీ ప్రయోజనాలు కూడా అదనంగా లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటితో పోలిస్తే స్టార్ లింకు ధర చాలా ఎక్కువ అని తెలుస్తుంది.