Todays Gold Rate: తగ్గిన బంగారం ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాలలో తులం ఎంతంటే..
మన దేశ మహిళలకు బంగారం కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో వాళ్లు ఏ చిన్న సందర్భం వచ్చినా కూడా ముందుగా బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తారు. మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. అంతగా బంగారం మరియు వెండి మన జీవితాలతో ముడిపడి ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ బంగారం ఆభరణాలను మహిళలు కేవలం అలంకరణకు మాత్రమే కాదు భవిష్యత్తులో వాళ్లకు ఒక ఆర్థిక భరోసాగా కూడా భావిస్తారు. గత కొన్ని ఏళ్ల నుంచి మన దేశంలో బంగారాన్ని ఒక మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇక ఈరోజు జూన్ 11వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నాయి.
మనదేశంలో పలు ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం,ముంబై, చెన్నై, కలకత్తా వంటి నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.89,440, ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ఈరోజు రూ.97,570 గా ఉందని సమాచారం.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం తులం బంగారం ధర ఇతర ప్రాంతాల ధరలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.97,720, 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.89,590 గా ఉందని సమాచారం. ఇక ఈరోజు అన్ని ప్రధాన నగరాలలో కిలో వెండి ధర రూ.1,19,100 గా ఉంది.