IPL 2025: బయట పిచ్ లపై సన్ రైజర్స్ ఢీలా ఎందుకంటే..?

IPL 2025
IPL 2025

IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఐపీఎల్ 2025 లో గడ్డు కాలం ఎదురవుతోంది. పూర్తిగా ఎటాకింగ్ కు అలవాటు పడ్డ సన్ రైజర్స్ బ్యాటర్లు, హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలోనే కాస్త బ్యాటింగ్ మెరుగ్గా చేయగలుగుతున్నారు. కానీ మిగతా సిటీల్లో చేతులెత్తేస్తున్నారు. సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తున్నారు. టీ 20 మ్యాచుల్లో ఇలాంటి బ్యాటింగ్ అవసరమే. కానీ వారిద్దరూ కేవలం దూకుడుగా ఆడటం హైదరాబాద్ లోని ఉప్పల్ పిచ్ కు మాత్రమే పరిమితం కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో హైదరాబాద్ కేవలం రెండింట్లో గెలిచింది. అది కూడా హైదరాబాద్ పిచ్ పైనే. మరో రెండు మ్యాచులు కూడా హోం టౌన్ లో ఓడిపోయింది. బ్యాటింగ్ పిచ్ ల మీద దంచి కొడుతూ 280 పరుగుల వరకు చేస్తున్న సన్ రైజర్స్ బ్యాటర్లు, బౌలింగ్ లేదా కాస్త స్లో పిచ్ ల మీద తేలిపోతున్నారు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కిందా మీదా పడి కేవలం 162 పరుగులు చేసింది. పిచ్ కాస్త స్లోగా ఉంది. అయితే ఇలాంటి పిచ్ పై బ్యాటింగ్ చేయడం కష్టమే. కానీ 200 వరకు పరుగులు చేస్తేనే ఛేజింగ్ చేయడం కష్టంగా మారుతుంది. ట్రావిస్ హెడ్ లాంటి విధ్వంసకర బ్యాట్స్ మెన్ 29 బంతుల్లోనే 28 పరుగులు చేశాడంటే పిచ్ ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ స్లో, బౌన్సీ వికెట్ పై కూడా సన్ రైజర్స్ బ్యాటర్లు బాగా ఫర్మామెన్స్ ఇవ్వగలగలి. అలా అయితేనే నెక్ట్స్ జరగబోయే మరో ఆరు మ్యాచుల్లో విజయం సాధించి ప్లే ఆప్స్ కు చేరగలుగుతారు.

ఇక బౌలింగ్ విభాగానికొస్తే ఈసారి చాలా పేలవంగా బౌలింగ్ వేస్తున్నారు. స్లో వికెట్ పై కూడా మహమ్మద్ షమీ దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇటు ప్యాట్ కమిన్స్ కూడా భారీగా పరుగులు ఇచ్చినా మూడు వికెట్లతో ఫామ్ లోకి రావడం ఆనందించాల్సిన విషయం. సన్ రైజర్స్ సొంత గడ్డపై కాకుండా రాబోయే మ్యాచుల్లో కోల్ కతా, పంజాబ్ లాంటి పిచ్ లపై కూడా బాగా ఆడితేనే ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఇదే విషయమై సన్ రైజర్స్ కోచ్ డానియల్ వెటోరీ కూడా స్పందించాడు.

హైదరాబాద్ లోనే దూకుడు..

మా బ్యాటర్లు హైదరాబాద్ లోనే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రతి స్టేడియంలో ఇలాంటి ప్రదర్శన కనబరిస్తే బాగుండు. వేరే చోట ఆడే సమయంలో మాత్రం అలాంటి దూకుడును ప్రదర్శించలేకపోతున్నారు. అక్కడి పిచ్ ఎలా స్పందిస్తుంది. సమయానుకూలంగా గేర్స్ మార్చి ఎలా ఆడాలో అన్నది తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ ఓటమితో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. రాబోయే మ్యాచుల్లో ఎలా రాణించాలో తమ బ్యాటర్లు, బౌలర్లు పక్కా ప్రణాళికతో దిగి విజయం సాధించేందుకు ట్రై చేస్తామని సన్ రైజర్స్ కోచ్ డానియెల్ వెటోరి ప్రకటించారు. తదుపరి అన్ని మ్యాచుల్లో విజయం సాధిస్తేనే సన్ రైజర్స్ కు ప్లే ఆప్స్ కు వెళ్లే చాన్సు ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్స్ లో పదో స్థానంలో ఉండటం మింగుడుపడని విషయమే.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now