Virat Kohli Test Retirement: రెండు రోజుల కింద టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సడెన్ గా ఈ నిర్ణయం తీసుకునే సరికి రోహిత్ అభిమానులతో పాటు బీసీసీఐ సెలక్టర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే టీ 20 లకు రిటైర్మెంట్ ప్రకటించినా రోహిత్ శర్మ.. టెస్టులకు కూడా వీడ్కోలు చెప్పడంతో తన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ప్రస్తుతం విరాట్ కొహ్లీ కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహగానాలు ఊపందుకున్నాయి. టెస్టులకు రిటైర్మెంట్ విషయంపై కొహ్లీ ఇప్పటికే బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. కానీ ఒకే సారి ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు రిటైర్మెంట్ ఇస్తే రాబోయే సిరీస్ లో ఇంగ్లాండ్ లో 5 టెస్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది. అందుకోసం ఇంగ్లండ్ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ కు ఓకే అని ఇప్పుడు వద్దని విరాట్ కొహ్లీని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు 123 టెస్టు మ్యాచులు ఆడిన విరాట్ కొహ్లీ 68 టెస్టులకు సారథ్యం వహించాడు. అందులో 40 మ్యాచులను గెలిపించాడు. కొహ్లీ సారథ్యంలో టెస్టుల్లో నెంబర్ వన్ గా టీం ఇండియా ఎదిగింది. ప్రపంచ క్రికెట్ లో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్లలో విరాట్ కొహ్లీ నాలుగో వాడు. ఇండియా తరఫున మొదటి వాడు. ప్రపంచ క్రికెట్ లో గ్రేమ్ స్మిత్ 107 మ్యాచుల్లో (53) విజయాలు, రికీ పాంటింగ్ 48 విజయాలు 77 మ్యాచుల్లో , స్టీవ్ వా 41 విజయాలు 57 మ్యాచుల్లో సాధించారు. ఆ తర్వాత విజయవంతైన కెప్టెన్లలో విరాట్ కొహ్లీనే ఉన్నాడు. ఇటు భారత్ లో కూడా ఎక్కువగా విజయాలు విరాట్ కొహ్లీ సారథ్యంలోనే ఉన్నాయి. విరాట్ కెప్టెన్సీలో 40 విజయాలు, దోని కెప్టెన్సీలో 27 విజయాలు, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 21 విజయాలు సాధించింది టీం ఇండియా. విరాట్ టెస్టుల్లో 254 పరుగుల హైయెస్ట్ స్కోరు చేశాడు.
ప్రస్తుతం టెస్టు టీంలో అజింక్య రహనే, చటేశ్వర్ పూజారా లాంటి సీనియర్లు కూడా లేరు. కేవలం కేఎల్ రాహుల్ మాత్రమే సీనియర్ ప్లేయర్ గా ఉన్నాడు. బౌలింగ్ లో జస్ ప్రీత్ బుమ్రా ఉండగా.. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. ఇంగ్లంగ్ సీమ్ పిచ్ లపై కొత్త బ్యాటర్లు రాణించాలంటే చాలా కష్టం. అందుకే విరాట్ కొహ్లీని కనీసం ఇంగ్లండ్ తో సిరీస్ అయిపోయే వరకు అయినా టీంతో ఉంటే జూనియర్లకు అండగా నిలవడమే కాకుండా జట్టులో సమతూకం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. మరి విరాట్ కొహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.